క్రైమ్/లీగల్

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 21: అభంశుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి తెగబడ్డాడు. విషయం తెలుసుకున్న పలువురు గ్రామ పెద్దలు చిన్నారి కుటుంబీకులకు, నిందితుడికి మధ్య రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆదివారం ఈ దురాగతం వెలుగుచూసింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కామాంధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సంఘటన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరువలోనే ఉండే మోపాల్ మండలం ముదక్‌పల్లి గ్రామంలో పోసాని అనే మహిళ కుటుంబం నివాసం ఉంటోంది. ఆమెకు మూడేళ్ల కుమార్తె ఉండగా, అదే గ్రామానికి చెందిన శ్రావణ్ (18) అనే యువకుడు ఆ చిన్నారిపై కనే్నశాడు. గత మూడు రోజుల క్రితం ఇంటి బయట ఒంటరిగా ఆడుకుంటున్న చిన్నారిని గమనించి, ఇదే అదనుగా భావించాడు. చిన్నారిని గ్రామ శివారులోని నిర్జన ప్రదేశానికి ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. అనంతరం చిన్నారిని ఎప్పటిలాగే ఇంటి వద్ద దింపేందుకు తీసుకురాగా, బాలిక ఏడుస్తుండటంతో ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు అనుమానించిన తల్లి పోసాని శ్రావణ్‌ను నిలదీసింది. దీంతో ఆ యువకుడు పారిపోగా, గ్రామస్థులకు విషయం వివరించింది. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు బాధిత కుటుంబీకులకు, శ్రావణ్ కుటుంబీకులకు మధ్య రాజీ కుదిర్చేందుకు పలుమార్లు పంచాయతీ ఏర్పాటు చేసినట్టు తెలిసింది. అయితే రాజీ ప్రయత్నాలు విఫలం కావడంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి, శ్రావణ్‌పై పోక్సో చట్టంలోని 376(ఏ)(బీ)6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ సతీష్ తెలిపారు.