క్రైమ్/లీగల్

వ్యాసరాయల బృందావనం ధ్వంసం ఘటనలో దుండగుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, జూలై 21: హంపీ సమీపంలోని ఆనెగొందిలో ఉన్న శ్రీవ్యాసరాయల బృందావనాన్ని ధ్వంసం చేసిన ముఠాను కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు ముఠాసభ్యులు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందినవారు కావడం గమనార్హం. ఈ మేరకు నిందితుల వివరాలను కొప్పల్ ఎస్పీ శ్రీమతి రేణుకాసుకుమార్ ఆదివారం వెల్లడించారు. తాడిపత్రికి చెందిన పి.మురళీమనోహర్‌రెడ్డి(33),డి.మనోహర్(27), కె.కేశవ(29), డ్రైవర్ బి.విజయ్‌కుమార్(36), అర్చకుడు టి.బాలనరసయ్య ముఠాగా ఏర్పడి గుప్తనిధుల కోసం మంగళవారం రాత్రి శ్రీవ్యాసరాయల బృందావనాన్ని ధ్వంసం చేశారన్నారు. వీరంతా ఓ వాహనంలో హంపీ చేరుకుని అక్కడి నుంచి అనెగొందిలో ఉన్న శ్రీవ్యాసరాయల బృందావనాన్ని మంగళవారం చంద్రగ్రహణం రోజు ధ్వంసం చేశారన్నారు. నిందితులను అరెస్టుచేసి విచారణ జరుపుతున్నట్లు ఆమె తెలిపారు. సమావేశంలో బళ్లారి జిల్లా డీజీపీ ఎం.నంజుండస్వామి, గంగావతి డీఎస్పీ బిపి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...కర్నాటక పోలీసులు అరెస్టు చేసిన గుప్తనిధుల ముఠా సభ్యులు