క్రైమ్/లీగల్

మేజిస్ట్రేట్ నివాసంపై ఏసీబీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల క్రైమ్: జగిత్యాల ఫస్ట్ క్లాస్ అదనపుజూనియర్ సివిల్ జడ్జి ఎస్. మధు నివాసంలో శుక్రవారం ఉదయం ఏసీబీ దాడులు నిర్వహించడం జిల్లా కేంద్రమైన జగిత్యాలలో తీవ్ర సంచలనం సృష్టించింది. వరంగల్‌కు చెందిన జగిత్యాల కోర్టులో రెండున్నరేళ్లుగా ఫస్ట్ క్లాస్ జూనియర్ సివిల్ జడ్జీ పని చేస్తున్న ఎస్. మధు వైఖరిని నిరసిస్తూ బార్ అసోసియేషన్ సభ్యులు విధులను బహిష్కరించి వారం రోజుల నుండి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మధు పై జగిత్యాల బార్ అసోసియేషన్‌తోపాటు రామకృష్ణారావు, వెంకటేశ్వర్‌రావులు నేరస్తుల కేసులను కొట్టివేసేందుకు ఒకరి వద్ద పదివేలు, మరొకరి వద్ద 50 వేలు లం చంగా ఇవ్వాలని మెజిస్ట్రేట్ మధు డిమాండ్ చేసి వసూలు చేశారని వారు హైకోర్టుకు వెళ్లి ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు స్పందించిన హైకోర్టు మెజిస్ట్రేట్ నివాసంలో సోదాలు జరపాలని ఏసీబీని ఆదేశించింది. దీంతో శుక్రవారం ఉద యం 6 గంటలకే మెజిస్ట్రేట్ నివాసానికి చేరుకుని ఏసీబీ అడిషనల్ ఎస్పీ రమణకుమార్, డిఎస్సీ కిరణ్‌కుమార్, 10మంది సీఐల ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు విస్తృ త సోదాలు చేశారు. ఈ సందర్భం గా రూ. 4.20 లక్షల నగదుతోపాటు 6సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టుకు తరలించారు. మెజిస్ట్రేట్ మధు నివసిస్తున్న ప్రాంతం లో ఇతరులు ఎవరినీ అనుమతించకుండా జగిత్యాల టౌన్ సీఐ ప్రకాష్ అధ్వర్యంలో పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు. అలాగే మెజిస్ట్రేట్ మధుకు స్థానిక వైద్యులతో వైద్య పరీక్షలు చేయించారు.

చిత్రం.. మేజిస్ట్రేట్ మధును కరీంనగర్‌కు తరలిస్తున్న ఏసీబీ పోలీసులు