క్రైమ్/లీగల్

ముగ్గురు రైతుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలానగర్ : రైతులు తమ పశువులను పొలాల్లో మేపుతుండగా వారిపైకి దూసుకువచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. దాంతో ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం కుచ్చర్‌కల్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. తిరుమలాపూర్ గ్రామం నుండి రాజాపూర్‌కు వస్తున్న ఏపీ10 ఎఫ్ 3168 నెంబర్ గల కారు అతివేగంగా రైతులపైకి దూసుకెళ్లింది. దీంతో కుచ్చర్‌కల్ గ్రామానికి చెందిన పొడుగు చంద్రయ్య (48), రంగయ్య (52), మంగలి యాదగిరి (19) మృత్యువాత పడ్డారు. పశువులు పొలంలో మేతమేస్తుండగా ఈ ముగ్గురు రైతులు రోడ్డుపక్కన రోడ్డుపైకి పశువులు రాకుండా కాపలాగా ఉన్నారు. అయితే తిరుమలాపూర్ నుండి రాజాపూర్ గ్రామానికి వస్తున్న కారు ఒక్కసారిగా రైతులపై దూసుకెళ్లి వీరిని ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. రైతులను ఢీకొట్టిన డ్రైవర్ కారును ఆపకుండా పారిపోతుండగా కొందరు గ్రామస్థులు గమనించి కారును వెంబడించారు. కొద్దిదూరం వెళ్లాక కూడా డ్రైవర్ కారును ఆపకుండా వెళ్లిపోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులు కారుపైకి రాళ్లు విసిరి దాడి చేశారు. దాంతో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. కారు అద్దాలు ధ్వంసం కావడం, గ్రామస్థులు రాళ్లు విసురుతుండటంతో డ్రైవర్ అప్పుడు కారును నిలిపారు. వెంటనే గ్రామస్థులు వారిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే కారులో ఉన్న వారు మద్యం సేవించి ఉన్నారని పోలీసులకు గ్రామస్థులు వివరించారు. జరిగిన ఘటనపై రాజాపూర్ పోలీసులకు గ్రామస్థులు, మృతుల కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై శ్రీనివాస్‌రావు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ముగ్గురు రైతుల మృతికి కారకులైన వారిని ఘటనా స్థలికి తీసుకురావాలంటూ వారిని కూడా ఇక్కడే శిక్షిస్తామంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. రాత్రిపొద్దుపోయే వరకు మృతదేహాలు అక్కడే ఉండడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పి మృతదేహాలను పోస్టుమార్టంకుతరలించారు. ఈ ఘటనతో కుచ్చర్‌కల్ గ్రామంలో తీవ్రవిషాదం అలుముకుంది. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడం పట్ల ఆ గ్రామమంతా బోరున విలపించారు.
చిత్రాలు.. మృతి చెందిన చంద్రయ్య, రంగయ్య, యాదగిరి.