క్రైమ్/లీగల్

‘టాటా’కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 22: టాటాసన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటాతోబాటు ప్రస్తుత చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, ఎనిమిది మంది డైరెక్టర్లకు వ్యతిరేకంగా దాఖలైన పరువునష్టం దావా కేసు విచారణను ముంబై హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ నేరపూరిత పరువునష్టం దావాను నుస్లీ వాడియా అనే వ్యక్తి దాఖలు చేయడం జరిగింది. ఈమేరకు 2018 డిసెంబర్‌లో ముంబయి నగరానికి చెందిన మేజిస్ట్రేట్ కోర్టు రతన్ టాటాతోబాటు మిగిలిన నిందితులకు నోటీసులు జారీ చేసింది. కొన్ని టాటాగ్రూప్ కంపెనీలకు సంబంధించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న వాడియాను ఓటింగ్ ద్వారా తొలగించిన అనంతరం ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి పరువునష్టం దావా వేయడం జరిగింది. కాగా దీనిపై రతన్‌టాటాతోబాటు మిగిలిన నిందితులంతా తమపై వేసిన కేసు విచారణను కొట్టివేయాల్సిందిగా హైకోర్టును అశ్రయించారు. ఈక్రమంలో జస్టిస్ రంజిత్ మోరె, భారతి డాంగ్రేలతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం ఈ కేసును కొట్టివేస్తూ విచారణను పక్కన పెట్టింది. సైరస్ మిస్ర్తికి సన్నిహితుడైన వాడియాకు రతన్ టాటాకు మధ్య తలెత్తిన కార్పొరేట్ వివాదం తప్ప మరొకటి కాదని రతన్ టాటా తరపున వకాల్తాపుచ్చుకున్న సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింగ్వి వాదించారు.