క్రైమ్/లీగల్

నిర్మాణ పనుల్లో ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 22: రాజధాని నిర్మాణంలో భాగంగా తుళ్లూరు మండలం రాయపూడి ఎమ్మెల్యే గృహ సముదాయాల వద్ద లిఫ్ట్ పనులు చేస్తున్న ముగ్గురు కార్మికులు సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. రాయపూడి గ్రామంలో ఎమ్మెల్యేలు, ఎంపీల గృహ సముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి. ఓ భవనంలో లిఫ్ట్ మరమ్మతు పనులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా అది అదుపు తప్పి కూలీలపై పడింది. ఈ ప్రమాదంలో బీహార్‌కు చెందిన సురేంద్రకుమార్, రాహుల్‌కుమార్, తిరుపాల్‌కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఒకరు ఎలక్ట్రీషియన్‌కాగా మరో ఇద్దరు ఫిట్టర్లు. తుళ్లూరు ఎస్‌ఐ కిరణ్ కథనం ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన పలువురు కూలీలు, పనివార్లు రాజధాని అమరావతిలో పనుల నిమిత్తం ఇక్కడ నివసిస్తున్నారు. నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ పరిధిలో రాయపూడి వద్ద ఎమ్మెల్యే, ఎంపీ క్వార్టర్లకు లిఫ్ట్ ఏర్పాటు చేసేందుకు మరమ్మతు పనులు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు లిఫ్ట్ కిందపడటంతో బీహార్‌కు చెందిన సురేంద్రకుమార్ (21), రాహుల్ కుమార్ (24), తిరుపాల్ కుమార్ (50) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న తుళ్లూరు ఎస్‌ఐ హుటాహుటిన అక్కడకు చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం అమరావతి 30 పడకల ఆస్పత్రికి తరలించారు. మృతుల బంధువులకు సమాచారం అందించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చిత్రం... ప్రమాదంలో మృతి చెందినవారు