క్రైమ్/లీగల్

ఎట్టకేలకు సల్మాన్‌కు బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 7: కృష్ణ జింకను వేటాడిన కేసులో రెండు రోజుల పాటు జోధ్‌పూర్ జైల్లో గడిపిన నటుడు సల్మాన్ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిలు లభించింది. 1998నాటి ఈ కేసులో ఐదేళ్ల జైలు శిక్షకు గురైన సల్మాన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ జిల్లా సెషన్స్ న్యాయమూర్తి రవీందర్‌కుమార్ జోషి శనివారం ప్రకటించారు. తనను దోషిగా నిర్ణయించ డం, శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేయడానికి వీలు గా బెయిల్ మంజూరు చేయాలని సల్మాన్ ఖాన్ న్యాయమూర్తిని అభ్యర్థించిన విషయం తెలిసిందే. 50వేల బాండ్, దానికి సమానమైన రెండు పూచీకత్తులపై సల్మాన్‌కు బెయిల్ లభించిందని డిఫెన్స్ లాయర్ మహే శ్ బోరా తెలిపారు. ఇదిలావుండగా సల్మాన్‌ఖాన్ బెయిల్‌పై నిర్ణయం ప్రకటించాల్సిన జిల్లా సెషన్స్ న్యాయమూర్తిపై బదిలీవేటు పడింది. అయితే మార్పులు చేర్పుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజస్థాన్ హైకోర్టు స్పష్టం చేసింది. సెషన్స్ న్యాయమూర్తి రవీంద్రకుమార్ జోషిని శిరోహికి బదిలీ చేశామని, ఆయన స్థానంలో చంద్రకుమార్ సొంగారియాను జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తిగా నియమించామని రాజస్థాన్ హైకోర్టు తెలిపింది. మొత్తం 134మంది న్యాయమూర్తులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బదిలీ చేశారు.
ఆనందంలో బాలీవుడ్
రెండు రోజుల నిరీక్షణ తరువాత సల్మాన్‌కు బెయిల్ లభించడం బాలీవుడ్‌లో ఎనలేని ఆనందానికి కారణమైంది. సల్మాన్ స్నేహితులు, శ్రేయోభిలాషులు ఈ పరిణామం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేయడంతోపాటు జైలు శిక్షను నిలిపివేయడం వల్ల తదుపరి అప్పీల్‌కు ఆయనకు అవకాశం కలిగిందని తెలిపారు. సల్మాన్ జైలుకు వెళ్తే అనేక భారీ ప్రాజెక్టులు ఆగిపోయే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ఆయనకు బెయిల్ లభించటంతో పరిశ్రమ ఊపిరి తీసుకుంది.

చిత్రం..జోధ్‌పూర్ కోర్టు వద్ద సల్మాన్ చెల్లెలు, బంధువులు