క్రైమ్/లీగల్

ఐఓబీకి రూ. 75 కోట్లు టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: పెద్ద నోట్ల రద్దు సమయంలో తప్పుడు ఇన్వాయిస్‌లతో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే క్రమంలో దొరికిపొయిన పంజాగుట్ట కేంద్రంగా నడుస్తోన్న ముసద్దిలాల్ జూవెల్లర్స్‌పై తాజాగా మరో కేసు నమోదు చేశారు. పంజాగుట్ట కేంద్రంగా జూవెల్లర్స్ నడుస్తోంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఓబీ)కు రూ.75 కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టారన్న ఆరోపణలో సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి జూవెల్లర్స్ అండ్ ఎక్సపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు కంపెనీ డైరెక్టర్లు మోహన్‌లాల్ గుప్తా, ప్రశాంత్ గుప్తాను నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. పంజాగుట్ట కేంద్రంగా నడుస్తున్న ముసద్దిలాల్ జ్యువెలర్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2009 అక్టోబర్ మాసంలో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ నుంచి రూ.55కోట్ల రుణం తీసుకుంది. దీంతో తన రుణాన్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఓబీ)కి మార్చాలని జూవెల్లర్స్ ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్‌ను కోరింది. బ్యాంకు ఖాతాలకు సంబంధించి బ్యాలెన్స్ షీట్ సరిగానే నిర్వహించడంతో సంతృప్తి చెందిన ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్ 2013 సంవత్సరం మార్చి మాసంలో ఆ రుణాన్ని ఐఓబీ బ్యాంకుకు మార్చాడం జరిగింది. అనంతర బ్యాంకు వద్ద రుణం తీసుకోవడంతో అది కాస్త రూ.82 కోట్లకు చేరుకుంది. రుణాన్ని చెల్లించడంలో ముసద్దిలాల్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించడంతో రుణాన్ని చెల్లించడంలో విఫలమైంది. దీంతో 2014 మార్చిలో ఖాతాలను బ్యాంకు నిలిపివేసింది. అక్కడితో లావాదేవీలు స్థంభించిపోయాయి. 2016 సంవత్సరంలో జరిగిన ఆడిట్ తనిఖీల్లో వారు తీసుకున్న రుణంలో రూ. 58 కోట్ల రూపాయలను ఇతర కంపెనీలకు మళ్లించినట్టు తేలింది. దీన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. తమ వద్ద తీసుకున్న రుణాన్ని ఉద్దేశపూర్వకంగా మళ్లించి తమకు దాదాపు రూ.75 కోట్లు ఎగ్గొట్టారని బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. ఈమేరకు ఐఓబీ బ్యాంకు చీఫ్ రీజనల్ మేనేజర్ రవిచంద్రన్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీబీఐ బెంగళూరు శాఖ ముసద్దిలాల్ జూవెల్లర్స్‌తో పాటు కంపెనీ డైరెక్టర్లు మోహన్‌లాల్ గుప్తా, ప్రశాంత్ గుప్తాలపై ఐపీసీ సెక్షన్ 120, 406, 420, 468, 471 కింద కేసులు నమోదు చేశారు.