క్రైమ్/లీగల్

75 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: అక్రమ రవాణా చేస్తున్న ప్రజా పంపిణీ పథకం (పిడిఎస్)కి చెందిన 75 క్వింటాళ్ల బియ్యాన్ని టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి టాస్క్ఫోర్స్ డిసిపి కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహ్మద్ అర్షాద్ హుస్సేన్, కుమ్మరి విజయకుమార్, గండ్ల విజయ్‌కుమార్‌ను అరెస్టు చేసి బియ్యంతో పాటు డిసిఎం ఐషర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హుస్సేన్ ముషీరాబాద్ ప్రాంతంలో పిడిఎస్ బియ్యాన్ని కిలో రూ.8 చొప్పున రేషన్ కార్డు దారుల నుంచి సేకరించాడు. మరో నిందితుడు కుమ్మరి విజయకుమార్ కూడా కిలో పది రూపాయల చొప్పున సేకరించి ఆ బియ్యాన్ని కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి రవాణా చేసి అక్కడ రూ.12 చొప్పున విక్రయించేందుకు తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు.
తార్నాక రైల్వే డిగ్రీ కాలేజీలో డిసిఎం వాహనాన్ని తనిఖీ చేయడంతో బియ్యం పట్టుబడింది. దీంతో డ్రైవర్ గండ్ల విజయకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని, నిందితులను పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు.