క్రైమ్/లీగల్

నిషేధం కుదరకుంటే సెన్సార్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: బిగ్‌బాస్ -2 తెలుగు రియాలిటీ షోపై దాఖలైన వ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు విచారించింది. బ్రాడ్‌కాస్టింగ్ నిబంధనలకు విరుద్ధంగా బిగ్‌బాస్ షో ప్రసారం అవుతోందని , సినిమాలను ఎలాగైతే సెన్సార్ చేస్తారో, అదే విధంగా ఈ షోను కూడా సెన్సార్ చేసి ప్రసారం చేయాలని నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బిగ్‌బాస్ షో ద్వారా పిల్లలను, యువతను చెడుమార్గంలో తీసుకువెళ్లే అవకాశం ఉందని పిటిషనర్ వివరించారు. రియాలిటీ షోలో కన్సల్టెంట్ల ఎంపిక సందర్భంగా మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని, కనుక బిగ్‌బాస్ షోను వెంటనే నిలిపివేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. కార్యక్రమ నిర్వాహకుడు నాగార్జున, స్టార్ మా చానల్‌ను , సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం అండ్ కామర్స్, జిల్లా కలెక్టర్, డీజీపీ, హైదరాబాద్ సీపీనీ ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్‌లోని అంశాలపై వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా కేతిరెడ్డి పాత్రికేయులతోమాట్లాడుతూ ఈ ప్రోగ్రాంను నిషేధించడం కుదరకపోతే సెన్సార్ చేయాలని, రాత్రి 11 గంటల తర్వాతనే ప్రసారం చేయాలని కోరినట్టు చెప్పారు. కేతిరెడ్డి తరుఫున న్యాయవాది శాంతిభూషణ్ హాజరుకాగా, మిగిలిన ప్రతివాదుల తరఫున సీవీ మోహన్‌రెడ్డి హాజరయ్యారు. 2011 కేంద్ర ప్రభుత్వం బ్రాడ్‌కాస్టింగ్ రూల్స్‌కు విరుద్ధంగా ఈ కార్యక్రమం ఉందని కేతిరెడ్డి పేర్కొన్నారు.