క్రైమ్/లీగల్

జైలులో రిమాండ్ మహిళా ఖైదీ బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 22: రిమాండ్‌లో ఉన్న ఓ మహిళా ఖైదీ జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడి డజిల్లా కంది జైలులో సోమవారం సాయంత్రం 3.20 గంటలకు చోటు చేసుకుంది. జైలు సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చింతల సరోజ తన ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉండేది. భాస్కర్ అనే వ్యక్తిని సరోజ రెండవ వివాహం చేసుకున్నప్పటికీ భర్త ఆమెను దూరం పెట్టాడు. కుటుంబ పోషణ కష్టతరంగా మారడంతో మే 25న ఇద్దరు పిల్లలను బీరు సీసాతో గొంతుకోసి దారుణంగా హతమార్చి పరారైంది. తర్వాత కరీంనగర్‌లో పోలీసులకు లొంగిపోయింది. సరోజను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చగా జూన్ 12న సిద్దిపేట కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. దీంతో సరోజను సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంది జైలుకు తరలించారు. బెయిల్ ఇప్పించడానికి భర్త కానీ, తల్లిదండ్రులు కానీ రాకపోవడంతో సరోజ తీవ్ర మానసిక వత్తిడికి గురైంది. సరోజ పరిస్థితిని గమనించిన జైలు అధికారులు పలుమార్లు కౌన్సిలింగ్ ఇప్పించారు. బెయిల్ ఇప్పిస్తామని, జైలు ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంకులో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని భరోసా కల్పించారు. ఇటీవలే కరీంనగర్‌కు చెందిన ఓ సీనియర్ న్యాయవాది ద్వారా కూడా కౌన్సిలింగ్ ఇప్పించారు. అయినప్పటికీ సరోజలో మార్పు రాకపోగా సోమవారం సాయంత్రం 3.20 గంటల ప్రాంతంలో ఖైదీలు పగటిపూట ఉపయోగించే బాత్‌రూంలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టింది. గమనించిన జైలు అధికారులు హుటాహుటిన సంగారెడ్డిలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.