క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జూలై 23: మరణించిన ప్రభుత్వ ఉద్యోగికి రావాల్సిన బెనిఫిట్స్‌ను వారసులకు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. మెదక్ జిల్లా డీఎంహెచ్‌ఓ ప్రధాన కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ షౌకత్ అలీ 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డాడు. మరో ఉద్యోగి పరారయ్యాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది. మెదక్ ఉమ్మడి జిల్లా ఏసీబీ డీఎస్పీ రవికుమార్ కథనం ప్రకారం మెదక్ జిల్లా శివ్వంపేట పీహెచ్‌సీలో పనిచేస్తున్న హెడ్‌నర్స్ లలిత గుండె జబ్బుతో చనిపోయింది. ఈమెకు ప్రభుత్వ బెనిఫిట్స్ 1.90 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో జీపీఎఫ్ బూస్టర్‌కు సంబంధించిన డబ్బు మంజూరు కాగా మిగిలిన సరండర్ లీవ్ విషయంలో శివ్వంపేట పీహెచ్‌సీ ఉద్యోగి యూడీసీ నర్సింలు, మెదక్ డీఎంహెచ్‌ఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ షౌకత్ అలీ ఇరువురూ కలిసి లలిత కుమారుడు పూర్ణచందర్‌ను 30 వేలు లంచం అడిగారు. అంత డబ్బు ఇవ్వలేనని బతిమాలగా 15 వేలకు అంగీకరించారు. దీంతో ఏసీబీ డీఎస్పీ పూర్ణచందర్‌కు మృతురాలి కుమారుడు పూర్ణచందర్ ఫిర్యాదు చేశాడు.
పథకం ప్రకారం ఏసీబీ డీఎస్పీ రవికుమార్, సీఐలు మురళీమోహన్, భరత్‌కుమార్ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మాటువేశారు. షౌకత్ అలీకి పూర్ణచందర్ 15 వేల నగదు ఇస్తుండగా డీఎస్పీ, సీఐలు దాడులు జరిపి అతడిని అరెస్ట్ చేశారు. యూడీసీ నర్సింలు పరారీలో ఉన్నట్టు డీఎస్పీ తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న పనికోసం లంచం అడిగితే 1064కు ఫొన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. వేతనం కన్నా అధిక ఆస్తులు కలిగిన ఉద్యోగులు ఎవరైనా ఉంటే 9440446149కు ఫొన్ చేస్తే చాలని డీఎస్పీ తెలిపారు. అవినీతికి పాల్పడే అధికారులను క్షమించేది లేదన్నారు.
చిత్రాలు.. దాడులు చేసిన ఏసీబీ డీఎస్పీ రవికుమార్, సీఐ, పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్ షౌకత్ అలీ