క్రైమ్/లీగల్

ఆన్‌లైన్‌లో గోల్ మాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూలై 23: సెకండ్ హ్యాండ్‌లో ఏదైనా వస్తువు కొనాలంటే ముందు ఆన్‌లైన్‌లో వెతుకుతాము. వస్తువు కొనుగోలు చేసేందుకు ఓఎల్‌ఎక్స్, క్వికర్ లాంటి వెబ్‌సైట్‌ట్లు పరిశీలిస్తాము. తక్కువ ధర కలిగిన వస్తువులు మొదలుకొని లక్షల రూపాయల విలువ చేసే కార్లు, స్థలాలు, ఇళ్లు వంటి సమాచారం వెబ్‌సైట్‌లో ఉండడంతో ప్రజలు క్రయా విక్రయాలను ఆన్‌లైన్‌లో సాగిస్తున్నారు. వినియోగదారుల అవసరాలను ఆసరగా చేసుకుని సైబర్ నేరగాళ్లు తక్కువ ధరకే వస్తున్నాయని నమ్మించి మోసాలకు దిగుతున్నారు. దీనికి తోడు ఆర్మీ ఉద్యోగులమని బదిలీపై వెళ్తునందున తమ వద్ద ఉన్న కారు, బుల్లెట్ వాహనాలను విక్రయిస్తున్నట్లు మోసం చేస్తున్నారు. తాజాగా ఆర్మీలో పని చేస్తున్నాను.. ఉద్యోగరీత్యా హైదరాబాద్ నుంచి బదిలీ అయింది.. తన కారు, బుల్లెట్ వాహనాన్ని అత్యవసరంగా విక్రయిస్తున్నానని ఓఎల్‌ఎక్స్ వెబ్‌సైబ్‌లో పోస్టును చూసిన రవి కుమార్ అనే వ్యక్తి సంబంధిత నెంబర్‌కు ఫోన్ చేశాడు. వాహనాలకు సంబంధించిన ఫొటోలు పత్రాలు చూపించడంతో నమ్మి ఆర్మీ ఉద్యోగి చెప్పిన విధంగా కొంత డబ్బును ఆన్‌లైన్ చెల్లించాడు. రోజులు గడుస్తున్న ఆర్మీ ఉద్యోగి వాహనాన్ని పంపకపోగా ఏదొక కుంటిసాకు చెప్పడంతో పాటు మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించాడు. నకిలీ ఆర్మీ ఉద్యోగుల వాహనాల పేరుతో మోసపోయిన బాధితుల ఫిర్యాదు కుప్పలుగా రావడంతో సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ప్రతి రోజు వచ్చే ఫిర్యాదుల్లో 30 శాతం కంప్లెంటు ఆర్మీ వాహనాల పేరుతో మోసాలు కావడంతో పోలీసులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. నెల రోజుల్లో రెండు వేలకు పైచిలు బాధితులు పోలీసులకు ఫిర్యాలు వచ్చినట్లు సైబర్‌క్రైం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు.