క్రైమ్/లీగల్

హంద్రీనీవా కాలువలో పడి యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, ఏప్రిల్ 8 : హిందూపురం రూరల్ మండల పరిధిలోని జంగాలపల్లి వద్ద హంద్రీనీవా కాలువలో ఈత కోసం వచ్చిన ఓ యువకుడు తోటి స్నేహితుల ఎదుటే ప్రాణాలు కోల్పోయిన సంఘటన చోటు చేసుకొంది. ఆదివారం మధ్యాహ్నం సోమందేపల్లి మండలం నడింపల్లికి చెందిన కొందరు నాయకులు ఈత కోసం జంగాలపల్లి వద్దకు వచ్చారు. హంద్రీనీవా కాలువలో దిగి ఈత కొడుతుండగా నవీన్ (25) అనే యువకుడు బురదలో కూరుకుపోయాడు. అక్కడే ఉన్న స్నేహితులు నవీన్‌ను బయటకు లాగేందుకు ప్రయత్నించగా నీటిలో పలుమార్లు మునిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే హిందూపురం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా అప్పటికే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. ఈ మేరకు రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తిం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.