క్రైమ్/లీగల్

జనాభా లెక్కల ప్రచురణకు మరో నెల గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అస్సాం జనాభా లెక్కలకు సంబంధించి జాతీయ పౌర రిజిస్టర్ తుది జాబితా ప్రచురణ గడువును సుప్రీంకోర్టు ఆగస్టు 31 వరకు పొడిగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 20 శాతం నమూనా జాబితాను సరిచూసుకొనే అవకాశం ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ ప్రచురణ గడువును మరో నెల పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రిజిస్టర్‌లో పెద్ద ఎత్తున చేరికలు, తీసివేతలు ఉన్న దృష్ట్యా సరిచూసుకొనే అవకాశం ఇవ్వాలని, అస్సాం సరిహద్దు జిల్లాలకు బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు అధికంగా ఉన్నాయనీ.. అక్కడి అధికారులు స్థానికంగా ఉండే జనాభా పేర్లను తొలగించినట్లు అనుమానాలు ఉన్న దృష్ట్యా జాతీయ పౌర రిజిస్టర్‌ను మరోసారి సరిచూసుకొనే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈమేరకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్ బెంచ్ గడువును మాత్రం ఆగస్టు 31వరకు పొడిగించగలమే తప్ప 20 శాతం జాబితాను సరిచూసుకొనే అవకాశాన్ని ఇవ్వలేమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ ఆదేశాలు జారీ చేశారు. ‘యావత్ ప్రపంచానికి శరణార్థుల రాజధానిగా భారత్‌ను భావించలేమని’ చెబుతూ జూలై 19న ఇరు ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని జూలై 31వరకు గడువు ఇచ్చింది. అయినప్పటికీ జాతీయ పౌర రిజిస్టర్‌లో పెద్ద సంఖ్యలో సరిహద్దు జిల్లాల్లో చొరబాట్లు నేపథ్యంలో బంగ్లాదేశ్ పౌరుల సంఖ్య ఎక్కువగా ఉందనీ, అదే స్థాయిలో స్థానికుల పేర్లు తొలగించబడ్డాయని కోర్టుకు ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం జాతీయ రిజిస్టర్‌ను సరిచూసుకొనే అవకాశం ఇవ్వలేమని చెబుతూ.. గడువును మాత్రం మరోనెల ఇస్తున్నట్లు తీర్పునిచ్చింది.