క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 23: చిత్తూరు జిల్లా నగరి మండల పరిధిలోని తిరుపతి-చెన్నై జాతీయ రహదారి కనుమమిట్ట వద్ద మంగళవారం రాత్రి 10.30 గంటలకు రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడ్డ ఇద్దరిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినవారు తలనీలాలు సమర్పించి ఉండటంతో తిరుమలకు వెళ్లి వస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నగరి సమీపంలోని కనుమమిట్ట వద్ద ఓమిని వాహనాన్ని తమిళనాడు కాంచీపురానికి చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా ఢీకొంది. తమిళనాడు - తిరుపతి బస్సు తిరుపతి వైపు వస్తుండగా ఓమిని వ్యాన్ తమిళనాడుకు వెళుతోంది. బస్సు డ్రైవర్ చేసిన పొరపాటా లేక మారుతీ ఓమిని వాహనం నడుపుతున్న డ్రైవర్ చేసిన పొరపాటో తెలియదు కాని రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో నలుగురు మృతి చెందగా, ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న నగరి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే చిమ్మచీకటి కావడంతో మృతుల వివరాలు పోలీసులు వెల్లడించలేకపోయారు. నగరి ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొని చెన్నైకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.