క్రైమ్/లీగల్

తిరుమలలో మరో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 23: ప్రముఖులు బసచేసే పద్మావతి అతిథి భవనాల ప్రాంతంలో చోరీ జరిగి 10 రోజులు కూడా గడవక ముందే మరోమారు సోమవారం రాత్రి సన్నిధానం అతిథిభవనంలో చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన పుల్లయ్య అనే భక్తుడు సోమవారం శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకున్నాడు. సన్నిధానంలో 47వ గదిని అద్దెకు తీసుకున్నాడు. రాత్రి 8.30 ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి నారాయణగిరి అతిథి భవనాల వద్ద ఉన్న సారంగి హోటల్‌కు వెళ్లారు. 10.15 గంటలకు తిరిగి సన్నిధానం చేరుకున్నారు. తమ గది తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించిన పుల్లయ్య చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి వెంటనే గదిని పరిశీలించాడు. రూ.20వేల నగదు, రెండు బంగారు గాజులు, ఒక నెక్లెస్ చోరీ కావడాన్ని గుర్తించి టీటీడీ సిబ్బందికి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రైం సీఐ మోహన్, తన సిబ్బందితో సన్నిధానం చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం పరిశీలించి ఆధారాలు సేకరించింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించలేదని, అయినప్పటికీ నేరస్థులను పట్టుకుంటామన్నారు. సీసీ కెమేరాలు ఏర్పాటుపై టీటీడీ అధికారులతో చర్చిస్తానన్నారు. తిరుమలలో నేరాల నియంత్రణకు ఎస్పీ అన్బురాజన్ ఎప్పటికపుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. బాధితుడు పుల్లయ్య మాట్లాడుతూ రాత్రి భోజనానికి వెళ్లి వచ్చిన గంటన్నరలోపే చోరీ జరిగిందని వాపోయాడు.