క్రైమ్/లీగల్

ఐపీఎల్‌పై హైకోర్టులో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 8: మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్‌ను అరికట్టడానికి బీసీసీఐ ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టకుండానే ఐపీఎల్‌ను నిర్వహించొద్దంటూ తమిళనాడు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఐపీఎల్ అధికారి జి.సంపత్‌కుమార్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖల చేశాడు. ఐపీఎల్‌లో ఆడే 8 జట్లను ఇందులో ప్రతివాదులుగా చేర్చాడు. పిల్‌ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ ఇంద్రా బెనర్జీ, జస్టిస్ సెల్వంతో కూడిన ధర్మాసనం.. కేంద్ర హోంశాఖ, బీసీసీఐకి నోటీసులు పంపింది. తదుపరి విచారణను ఏప్రిల్ 13కు వాయిదా వేసింది. దీనిపై పటిషనర్ సంపత్‌కుమార్ మాట్లాడుతూ ఐపీఎల్ 2013 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసును విచారణాధికారిగా తాను బయటపెట్టానని, ఇపుడు కూడా ఐపీఎల్‌ను కాపాడటానికే పిల్ వేసినట్టు తెలిపాడు.