క్రైమ్/లీగల్

నీటి వృథా నేరమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 29: ‘దేశ వ్యాప్తంగా 33 శాతం మంది ప్రజలు వివిధ సందర్భాల్లో నీటిని వృథా చేస్తున్నారు.. ఇది కచ్చితంగా నేరం చేసినట్లే అవుతుంది.. దీనిని అరికట్టేందుకు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారో నివేదిక ఇవ్వండి’ అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటి) కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బ్రష్ చేసేటప్పుడు, స్నానం చేసే సమయంలో ఇంకా అనేక సందర్భాల్లో నీరు వృథాగా పోతోంది.. దీనిని అరికట్టేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ ఢిల్లీ బీజేపీ కౌన్సిలర్ రాజేంద్ర త్యాగి, మరికొన్ని ఎన్జీవో సంస్థల ప్రతినిధులు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని బెంచ్ పిటిషన్ సోమవారం విచారించింది. ఈమేరకు దేశ వ్యాప్తంగా నీటి వృథాను అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకొంటున్నారో నెల రోజుల్లో తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్‌జీటీ ఆదేశించింది. నీరు వృథా అవుతోందని తెలిసినప్పటికీ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వీరు ఆరోపించారు. వీరి వివరాల మేరకు నిత్యం నాలుగు కోట్ల 84 లక్షల 20వేల క్యూబిక్ మీటర్ల నీరు వృథా అవుతుండగా.. 163 మిలియన్ల మంది తాగునీటి కోసం తహతహలాడుతున్నారు. దేశంలో దాదాపు 600 మిలియన్ల మంది నీటి కోసం నానా తంటాలు పడుతున్నారు. ఎన్నో మిలియన్ లీటర్ల నీరు వృథాగా పోతున్నా ఎలాంటి చర్యలను ప్రభుత్వాలు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందని ఎన్‌జీటికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యం గా గృహాల్లో, వ్యాపార సముదాయాల్లో నీరు వృథా అవుతోంది.. కేవలం ఒక్కసారి టాయ్‌లెట్‌లో ఫ్లష్ చేస్తే 15 నుంచి 16 లీటర్ల నీరు వృథాగా పోతోంది.. అలాగే, షవర్‌ను వాడడం ద్వారా నిమిషానికి పది లీటర్ల నీరు వృథా అవుతోందని చెప్పారు. మూడు నుంచి ఐదు నిమిషాల పాటు బ్రష్ చేస్తున్నప్పుడు దాదాపు 25 లీటర్ల నీటిని ఖర్చు చేస్తున్నారని ఎన్‌జీటికి చెప్పారు. అనేక సందర్భాల్లో నీరు ఏ విధంగా వృథా అవుతోందో వీరు పిటిషన్‌లో సవివరంగా పేర్కొన్నారు.