క్రైమ్/లీగల్

చత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జూలై 29: అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు పిలుపునిచ్చిన మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. వారోత్సవాల విజయవంతం కోసం మావోలు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే భద్రతా బలగాలు వారిని ఆత్మరక్షణలోకి నెడుతున్నాయి. ఈ క్రమంలో రెండురోజుల క్రితం చత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రాష్ట్రంలో సోమవారం మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులను బలగాలు మట్టుబెట్టాయి. చత్తీస్‌గఢ్‌కు, తెలంగాణకు సరిహద్దున ఉన్న సుకుమా జిల్లా కుంట పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కుంట పోలీస్‌స్టేషన్ పరిధిలోని కన్నాయిగూడ అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ చేపట్టాయి. ఈ సమయంలో మావోయిస్టులు తారసపడి కాల్పులకు దిగటంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. జోరు వర్షంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బలగాల ధాటికి మావోలు చెల్లాచెదురయ్యారు. కాల్పుల అనంతరం ఆ ప్రదేశంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయని, అందులో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉందని ఆ రాష్ట్ర డీజీపీ డీఎం అవాస్తి, యాంటీ నక్సల్స్ ఆపరేషన్ డీఐజీ సుందర్‌రాజ్, సుకుమా ఎస్పీ శలభ్‌సిన్హా ప్రకటించారు. అలాగే 12 బోర్ తుపాకీ, దేశీ తుపాకీ, గ్రేనైడ్ లాంచర్, 30కిలోల జిలిటిన్‌స్టిక్స్, మందుపాతరలు, వైర్లు, విప్లవసాహిత్యం, నిత్యవసరాలు లభించాయన్నారు. మావోయిస్టులు హింసకు పాల్పడకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బస్తర్, దంతెవాడ, బీజాపూర్, నారాయణపూర్, కొండగావ్, సుకుమా, కాంకేర్ జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉన్న నేపథ్యంలో అక్కడ అదనపు బలగాలను మోహరించామని పేర్కొన్నారు.
ఈ ఏడాదిలోనే 59 ఎన్‌కౌంటర్లు
మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న చత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జూలై 29వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 59 ఎన్‌కౌంటర్లు చోటు చేసుకోగా ఆ ఘటనల్లో 45 మంది మావోయిస్టులు, 15 మంది భద్రతా బలగాలు మృతి చెందారు. 2018లో భారీ ఎన్‌కౌంటర్లు చోటు చేసుకోగా 166 మంది మృతి చెందారు. ఇందులో 124 మంది మావోయిస్టులు ఉండగా 52 మంది సీఆర్‌పీఎఫ్, డీఆర్‌జీ, కోబ్రా, జిల్లా పోలీసులు మృతి చెందినట్లు చత్తీస్‌గఢ్ పోలీసు రికార్డులు పేర్కొంటున్నాయి.

చిత్రం...మృతదేహాలను తరలించేందుకు సిద్ధం చేస్తున్న బలగాలు