క్రైమ్/లీగల్

రైస్ పుల్లింగ్ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 29: రైస్ పుల్లింగ్, బంగారాన్ని తక్కువ రేటుకు అమ్ముతామని ప్రచారం చేస్తూ ప్రజలను మోసగిస్తున్న ముఠాను మచిలీపట్నం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి సోమవారం మీడియా ముందు హాజరుపరిచారు. సీసీఎస్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను సీసీఎస్ ఇన్‌ఛార్జ్ డీఎస్పీ ఎస్కే అబ్దుల్ అజీజ్ వివరించారు. గుడివాడ బిల్లపేట గ్రామానికి చెందిన బొడ్డేపల్లి రాజేష్ వెల్డింగ్ పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురాలోచనతో రైస్ పుల్లింగ్‌కు సంబంధించిన విశేషాలు తెలుసుకుని అతని స్నేహితులైన కాగిత చంద్రశేఖర్, (లంకపల్లి), గురిమెళ్ల హర్షవర్ధన్ (ముదినేపల్లి), నర్రా గణేష్ (గుడివాడ), బొంతుల శ్రీను (్భమడోలు), బాకీ లక్ష్మీపతి ( ఆ సర్వపేట కొత్తగూడెం), షేక్ అల్లాబక్షు (గుడివాడ), బాపట్ల కోటేశ్వరరావు(గుడివాడ), కారే దుర్గా ప్రసాద్ (తాళ్లపాలెం), జంపని దేవదత్త (గుడ్లవల్లేరు)తో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరంతా కలిసి రైస్‌పుల్లింగ్‌కు సంబంధించిన టార్చ్ ఫెయిల్, నల్ల పసుపు, చంద్రకాంత్ ముత్యం, నీడిల్ పుషింగ్, టర్కీ నోట్లు మొదలైన పరికరాలు అమ్మితే లాభం వస్తుందనే ఆశతో ప్రజలను మోసం చేస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. ఇంతే కాకుండా బంగారాన్ని ఆకువీడులో సగం రేటుకు ఇప్పిస్తామని ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించామన్నారు. మచిలీపట్నంకు చెందిన సిద్ధిశెట్టి ఖాజావలి అనే వ్యక్తి నుండి రూ.50వేలు తీసుకుని మోసం చేసినట్లు తెలిపారు. దీనిపై కేసు కూడా నమోదైనట్టు తెలిపారు. గుడివాడ రూరల్ పోలీసు స్టేషన్, గుడివాడ వన్ టౌన్ పోలీసు స్టేషన్లలో తరహా మోసాలకు వీరు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. అరెస్టు చేసినవారి నుండి చోరీకి గురైన పలు అభరణాలను రికవరీ చేశారు. ఈ సమావేశంలో సీసీఎస్ ఎస్‌ఐ హబీబ్ బాషా, మచిలీపట్నం ఎస్‌ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.