క్రైమ్/లీగల్

నలుగురు సూడో నక్సల్స్ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 29: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టుల పేరుతో అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్న నలుగురు నకిలీ నక్సల్స్‌ను సోమవారం వరంగల్ కేయూసీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల నుండి లక్షా 65 వేల రూపాయలతో పాటు, బొమ్మతుపాకి, 16 సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, కత్తిపెన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో తొర్రూర్ మండలం మహబూబాబాద్ జిల్లాకు చెందిన పూసల శ్రీమన్నారాయణ, వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం కామారెడ్డి గ్రామానికి చెందిన పోతరాజు అశోక్, వరంగల్ అర్బన్ జిల్లా ఎల్‌బీ నగర్ ప్రాంతానికి చెందిన నర్మెట నాగరాజు, జనగామ జిల్లా కొడకండ్ల మండలం చెరువుముందు తండాకు చెందిన ధరావత్ శ్రీనివాస్ ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ వెల్లడించారు. ప్రధాన నిందితుడు పూసల శ్రీమన్నారాయణ ఎంఎస్సీ వరకు చదువుకొని 2004 నుండి 2009 వరకు తొర్రూరు మండలం రాయపర్తి ప్రభుత్వ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో లెక్చరర్‌గా పనిచేయడంతో పాటు మరింత సంపాదన కోసం నిందితుడు శ్రీమన్నారాయణ తాను సొంతంగా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, జాబ్ కన్సల్టెన్సీ నిర్వహించాడు. ఈ వ్యాపారం ద్వారా ఆదాయం రాకపోగా నష్టపోవడంతో నిందితుడు సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో పడి, ఇందులో భాగంగా నకిలీ నక్సల్స్ పేరుతో సులభంగా డబ్బు సంపాదించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాడు. ఇందుకోసం మరికొంత మంది అవసరం కావడంతో శ్రీమన్నారాయణ పరిచయస్తులైన మరో ముగ్గురు నిందితులతో కలిసి కాంట్రాక్టర్లు, వ్యాపారుస్థులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకొని వారిని మావోయిస్టు నాయకులైన దామోదర్, భాస్కర్ పేరుతో ఫోన్ల ద్వారా బెదిరించి డబ్బు వసూళ్ళకు పాల్పడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని అన్నారు. ఈ నలుగురు నిందితులు తాము అనుకున్న ప్రకారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మావోయిస్టు నాయకుల పేరుతో ముగ్గురు వ్యాపారస్థులను బెదిరించి డబ్బు వసూళ్ళకు పాల్పడ్డారు. ఇందులో హంటర్‌రోడ్డులో ఉన్న చిట్‌ఫండ్ వ్యాపారస్తుడిని బెదిరించి లక్ష రూపాయలతో పాటు తొర్రూర్ ప్రాంతానికి చెందిన రియల్టర్ వద్ద మరో 50 వేల రూపాయలు, జనగామ జిల్లా కేంద్రం వ్యాపారస్తుని వద్ద పదివేల రూపాయలు, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద 30 వేల రూపాయలు బెదిరించి వసూళ్ళకు పాల్పడటంతో పాటు మరో రెండు సంఘటనల్లో ఇద్దరు వ్యాపారులను డబ్బుకోసం బెదిరించారు.
చిత్రం... నిందితుల వివరాలను వెల్లడిస్తున్న సీపీ రవీందర్