క్రైమ్/లీగల్

జగన్ పీఎస్ పేరుతో మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, జూలై 30: మాజీ రంజీ క్రికెటర్ నాగరాజును మంగళవారం నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్టుచేశారు.
ఈ సందర్భంగా రూరల్ డిఎస్పీ రాఘవరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ మాజీ రంజీ క్రికెటర్ బి నాగరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్సనల్ సెక్రటరీనంటూ పరిచయం చేసుకుని వివిధ సంస్థలనుంచి నగదు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. నిఘా పెట్టి మంగళవారం సింహపురి హాస్పటల్ సమీపంలో నాగరాజును అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. నాగరాజు 2014 నుండి 2016 వరకు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ రంజీలో ఆడేవాడని ఆయన తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడని, గతంలో వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ఐదుసార్లు జైలుకు వెళ్లి వచ్చాడని డిఎస్పీ తెలిపారు. ఇతను శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవ్వారిపేట గ్రామానికి చెందిన వాడన్నారు.
రెండు రోజుల క్రితం ఓ ప్రముఖ హాస్పటల్‌కు ఫోన్ చేసి తాను ముఖ్యమంత్రి జగన్ పీఎస్‌నని, వేరే వ్యక్తిగా పరిచయం చేసుకొని క్రికెటర్ నాగరాజు అనే వ్యక్తికి సహాయం చేయాలని అలా సహాయం చేస్తే అతను క్రికెట్ ఆడే సమయంలో బ్యాట్‌పై మీ హాస్పటల్ పేరు వేసుకుంటాడని నగదు ఇవ్వవల్సిందిగా యజమాన్యాన్ని డిమాండ్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు. ఇలా చేయడంతో ఆ హాస్పటల్ యాజమాన్యం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నాగరాజుపై దృష్టి సారించి మంగళవారం అదుపులోకి తీసుకొని విచారించగా ఆసుపత్రులకు ఫోన్ చేసి డబ్బులు అడిగినట్టు అంగీకరించాడన్నారు.
కేసు నమోదు చేసి నాగరాజును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు మస్తానయ్య, నాగార్జున్ పలువురు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.