క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో గంట్యాడ తహశీల్దార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంట్యాడ: అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారుల వలలో మంగళవారం గంట్యాడ తహశీల్దార్ చిక్కుకున్నారు. గంట్యాడ తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం జరిపిన ఏసీబీ మెరుపుదాడులతో ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఏసీబీ అధికారుల వలలో ఈసారి పెద్ద తిమిలింగమే చిక్కింది. నో-అబ్జెక్షన్ సర్ట్ఫికెట్ కోసం ఓ వ్యక్తి నుంచి 50వేలు రూపాయలు లంచం తీసుకుంటున్న తహశీల్ధార్ డి.శేఖర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ డి.వి.ఎన్.నాగేశ్వరరావు విలేఖరులకు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం పట్టణానికి చెందిన రొంగళి శ్రీనివాసరావు తన భార్య భవానీ పేరిట ఎస్‌ఆర్ పెట్రోల్ బంక్ కోసం గంట్యాడ మండలం కరకవలస గ్రామంలో 20సెంట్ల స్ధలానికి సంబంధించి నో-అబెక్జన్ సర్ట్ఫికెట్ కోసం రెవెన్యూతోసహా మరో నాలుగుశాఖలకు దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన నాలుగు శాఖల నుంచి అనుమతి లభించినప్పటికీ రెవెన్యూ శాఖ నుంచి మాత్రం సర్ట్ఫికెట్ రాలేదు. ఈ నేపధ్యంలో పెట్రోల్ బంకు కోసం నో-అబెక్జన్ సర్ట్ఫికెట్ కోసం తహశీల్ధార్ శేఖర్‌ను శ్రీనివాసరావు సంప్రదించారు. సర్ట్ఫికెట్ కోసం 50వేల రూపాయలు లంచం కావాలని తహశీల్ధార్ శేఖర్ డిమాండ్ చేయడంతో శ్రీనివాసరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల పథకం ప్రకారం మంగళవారం మధ్యాహ్నాం రెండు గంటల సమయంలో తహశీల్ధార్ కార్యాలయంలోనే ఉన్న తహశీల్ధార్ శేఖర్ రూ.50 వేలు శ్రీనివాసరావు నుంచి లంచం తీసుకుంటుండగా అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు, సిఐలు తహశీల్ధార్‌ను పట్టుకున్నారు.
తహశీల్ధార్ నుండి 50వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు తహశీల్ధార్ శేఖర్‌పై కేసు నమోదు చేశామని, ఆయనను అరెస్టు చేసి విచారణ నిమిత్తం విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ దాడులలో ఏసీబీ సిఐలు భాస్కరరెడ్డి, మహేష్, సతీష్ సిబ్బంది పాల్గొన్నారు. సీతానగరం మండలం నుంచి ఇటీవల గంట్యాడ తహశీల్ధార్‌గా బాధ్యతలు చేపట్టిన శేఖర్ వారంరోజుల వ్యవధిలోనే పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడటం సంచలనం రేకెత్తించింది.
ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ మహిళా ఉద్యోగిని
అనకాపల్లి టౌన్: పారిశుద్ద్య పనుల నుండి పదవీ విరమణ పొందిన మహిళా కార్మికురాలి నుండి లంచం తీసుకుంటూ అనకాపల్లి జీవీఎంసీ మహిళా ఉద్యోగిని మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) అధికారులు పట్టుకున్నారు. రిటైరైన కార్మికురాలి పిఎఫ్ సొమ్మును మంజూరు చేయడానికి రూ. ఆరు వేల రూపాయలను ఆ మహిళా ఉద్యోగి లంచం డిమాండ్ చేసింది. చేసేది లేక ఏసీబీ అధికారులకు కార్మికురాలు ఫిర్యాదు చేసింది. అనకాపల్లి జీవిఎంసీ కార్యాలయంలో మంగళవారం మహిళా ఉద్యోగిని పట్టుకున్న తర్వాత ఏసీబీ డీఎస్పీ రంగరాజు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జీవిఎంసీ జోనల్ కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్‌గా టి.లక్ష్మిదేవి విధులు నిర్వహిస్తున్నారు. పారిశుద్ద్య కార్మికురాలుగా పనిచేసి పదవీ విరమణ పొందిన ఎర్రంశెట్టి సుభద్రకు జీవిఎంసీ నుండి రావల్సిన పిఎఫ్ సొమ్ముకు సంబందించి చెక్కును మంజూరు చేయడానికి 10వేల రూపాయలు లంచం ఇవ్వాలని అకౌంటెంట్ లక్ష్మిదేవి ఆ కార్మికురాలిని డిమాండ్ చేసింది. రూ.6వేలు ఇస్తానని ఒప్పందం చేసుకుంది. మంగళవారం సుభద్రమ్మ 6వేలు ఇస్తున్న సమయంలో ఏసీబీ డీఎస్పీ రంగరాజు,అధికారులు దాడులు జరిపి పట్టుకొని లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఆమె వద్ద ఉన్న రికార్డులు పరిశీలించారు.
చిత్రం...తహశీల్దార్ శేఖర్‌ను విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు