క్రైమ్/లీగల్

సెర్బియా పోలీసుల అదుపులో నిమ్మగడ్డ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 30: తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం- ప్రకాశం జిల్లా వాడరేవు మధ్య పోర్ట్ కారిడార్ (వాన్‌పిక్) ఒప్పందంలో భాగంగా దుబాయ్‌కు చెందిన రస్ ఆల్ ఖైమా సంస్థకు ప్రభుత్వానికి 2008లో నిమ్మగడ్డ మధ్యర్తిత్వం నెరపటంతో పాటు వాన్‌పిక్‌లో 51 శాతం రస్ ఆల్ ఖైమా, 49 శాతం మాట్రిక్స్ హోల్డింగ్స్ సంస్థ పేరిట ఎంఓయూలు కుదుర్చుకోవటంలో కీలక సూత్రదారిగా ఉన్నారు. ఇందులో భాగంగా అప్పట్లో ప్రభుత్వం 26వేల ఎకరాల భూ సేకరణ జరిపింది. అనంతరం 2013లో కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దీంతో రస్ ఆల్ ఖైమా కోర్టును ఆశ్రయించింది. సంస్థ ప్రతినిధులు నిమ్మగడ్డపై కూడా ఫిర్యాదు చేశారు. దీంతో బెల్‌గ్రేడ్‌లో పోలీసులు నిమ్మగడ్డను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సెర్బియాలో విహారయాత్రకు కుటుంబ సభ్యులతో కలసి వెళ్లిన నిమ్మగడ్డ అక్కడి పోలీసులకు చిక్కారు. నిమ్మగడ్డను భారత్‌కు రప్పించాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌కు లేఖ రాసినట్లు వినికిడి. ఆయన్ను అరెస్టు చేయకుండా సురక్షితంగా భారత్‌కు తిప్పి పంపాలని లేఖలో కోరినట్లు సమాచారం. వాన్‌పిక్ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగిందని సీబీఐ అభియోగాలు మోపిన సంగతి విదితమే. దీనిపై గత ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. భూ సేకరణలో భాగంగా రస్ ఆల్ ఖైమా ఒప్పంద సమయంలో కొంత మొత్తాన్ని చెల్లించినట్లు తెలిసింది. వాడరేవు- నిజాంపట్నం పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్‌పిక్) ఒప్పందంలో మాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ ప్రధాన సూత్రదారిగా ఉన్నారు. ప్రకాశం జిల్లా వాడరేవు నుంచి గుంటూరు జిల్లా నిజాంపట్నం వరకు పోర్ట్ కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు వైఎస్ హయాంలో 2008లో ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా దుబాయ్‌కి చెందిన రస్ ఆల్ ఖైమా సంస్థ నాడు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం సముద్ర తీరంలో 26 వేల ఎకరాల భూ సేకరణతో పాటు రూ. 16 వేల కోట్లతో అంచనాలు రూపొందించారు. అప్పట్లో వాన్‌పిక్ ఒప్పందానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఈ ప్రాంతంలో ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కొంత భూమిని రస్ ఆల్ ఖైమా కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన మాట్రిక్స్ సంస్థకు కూడ భాగస్వామ్యం ఉంది. అయితే వేల ఎకరాలు విదేశీ కంపెనీకి దారాదత్తం చేస్తున్నారని అప్పట్లో ప్రభుత్వంపై అభియోగాలు వచ్చాయి. అంతేకాదు తీరంలో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని పరిశ్రమల కారణంగా సముద్ర ఉత్పత్తులు అంతరించిపోయే ప్రమాదం ఉందని అప్పట్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీం కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వాన్‌పిక్ ఒప్పందంలో రూ. 854 కోట్ల విలువైన 12 వేల ఎకరాల భూమికి సంబంధించి క్విడ్ ప్రోకో జరిగినట్లు సీబీఐ సంస్థ కూడా అభియోగాలు మోపింది. ఈ వ్యవహారంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో పాటు, మంత్రి మోపిదేవి వెంకట రమణారావు కూడా విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ ఒప్పందంలో నిమ్మగడ్డ తమను మోసగించాడంటూ రస్ ఆల్ ఖైమా అంతర్జాతీయ న్యాయ స్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం.