క్రైమ్/లీగల్

విద్యార్థిని సోనీ కిడ్నాప్ కేసులో వీడిన మిస్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ హయత్‌నగర్ జూలై 30: బీఫార్మసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్ మిస్టరీ వీడింది. వారం రోజుల క్రితం హైదరాబాద్ నగర శివారులోని హయత్‌నగర్‌లో అపహరణకు గురైన యువతి ఆచూకీ తెలియడంతో రాచకొండ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. హయత్‌నగర్‌లో ఈనెల 23న కిడ్నాపైన సోనీ ఆచూకీ ప్రకాశం జిల్లా అద్దంకిలో దొరికింది. పలు కేసుల్లో నిందితుడైన కిడ్నాపర్ రవిశేఖర్.. ఆమెను అక్కడ వదిలేసినట్లు తెలుస్తోంది. హయత్‌నగర్‌కు చెందిన బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు రవిశేఖర్ ఆచూకీ తెలిపిన వారికి రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ లక్ష రూపాయలు పారితోషికం ఇవ్వనున్నట్లు ప్రకటించి రోజు గడవకు ముందే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు పూర్తి వివరాల్లోకి వెళితే.. వారం క్రితం హయత్‌నగర్‌లో అపహరణకు గురైన యువతి ఆచూకీ లభ్యమైంది. కిడ్నాపర్ రవిశంకర్ ప్రకాశం జిల్లా అద్దంకిలో వదిలేసి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి బయల్దేరిన యువతి మంగళవారం తెల్లవారుఝామున హైదరాబాద్ నగరానికి చేరుకుంది. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో దిగి పక్కన ఉన్నవారి మొబైల్ నుంచి పోలీసులకు, తన తల్లిదండ్రులతో మాట్లాడి సమాచారం అందజేసింది. మహాత్మ గాంధీ అసుపత్రికి హయత్‌నగర్ పోలీసులు చేరుకొని ఆమెను పోలీస్టేషన్‌కు తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం విద్యార్థినిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఫార్మసీ విద్యార్థిని సోనీని కిడ్నాప్ చేసిన రవిశేఖర్‌ను హయత్‌నగర్ పోలీసులు ఒంగోలులో అరెస్టు చేశారు.