క్రైమ్/లీగల్

భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూలై 30: ప్రేమించి వివాహం చేసుకొని మూడేళ్ల పాటు కాపురం చేసిన భర్త మరో పెళ్లికి సిద్ధమైన విషయం తెలుసుకన్న భార్య అతని ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ హబీబ్‌నగర్‌లో నివాసం ఉండే ఆరీఫ్ నాలుగేళ్ల క్రితం వైజాగ్ వెళ్లగా అక్కడ దేవికతో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమకు దారితీసింది. దీంతో మూడేళ్ల క్రితం ఆరిఫ్, దేవికను వివాహం చేసుకొని వైజాగ్‌లోనే కాపురం చేశారు. ఏడాది క్రితం దేవికను నగరానికి తీసుకువచ్చిన ఆరిఫ్.. తీవ్రంగా వేధింపులకు గురిచేస్తూ ఇంటికి పంపించి వేశాడు. మంగళవారం తన భర్త రెండో పెళ్లికి సిద్ధమైనట్టు తెలుసుకున్న దేవిక తన కుమారుడుతో కలిసి హబీబ్‌నగర్‌కు చేరుకొని ఆరిఫ్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. బస్తీవాసులంతా దేవికకు మద్దతు పలికారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జూబ్లీహిల్స్ పోలీసులు ఆరిఫ్‌ను అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.