క్రైమ్/లీగల్

నౌహీరాపై కేసుల రికార్డులు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్‌పర్సన్ నౌహీరా షేక్‌పై నమోదైన కేసుల రికార్డులు, చార్జిషీట్‌లు, ఎఫ్‌ఐఆర్‌లతో పాటు బెయిల్ వివరాలను ఆగస్టు 7వ తేదీలోగా తమ ముందుంచాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఒకదాని తర్వాత మరో కేసు పెడుతూ పోలీసులు గత ఏడాది అక్టోబర్ 15 నుండి జైలులోనే ఉంచుతున్నారని దాంతో తమ కస్టమర్లకు డివిడెండ్ చెల్లించలేకపోతున్నామని నౌహీరా షేక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హీరా గోల్డ్ ఎగ్జిమ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ, నౌహీరా దాఖలు చేసిన నాలుగు పిటిషన్లను న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిని దాటి హీరాపై కేసులు నమోదుచేసిందని పిటిషన్లలో ఆరోపించారు. హీరా గ్రూప్ తరఫున మాజీ ఏజీ పీ వేణుగోపాల్ వాదనలు వినిపించారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదికలో హీరా గ్రూప్ వ్యవహారం కంపెనీల చట్టం కిందకు వస్తుందని పేర్కొన్నారని, మరో పక్క పోలీసులు మాత్రం కేసులు పెడుతున్నారని, కంపెనీ షరియత్ చట్టం ప్రకారం ఎవరికీ వడ్డీ చెల్లించదని, కేవలం డివిడెండ్ మాత్రమే ఇస్తుందని అన్నారు. నౌహీరా జైలులో కొనసాగడం వల్ల ఖాతాదారులకు సకాలంలో డబ్బు చెల్లించలేకపోతున్నామని, ఆమె విడుదలైతే స్వల్ప వ్యవధిలోనే ఖాతాదారులకు డివిడెండ్ ఇస్తామని అన్నారు. సీరియస్ ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ ఆఫీసు తరఫున నామరాపు రాజేశ్వర్‌రావు , ఫిర్యాదుదారుల తరఫున సయ్యద్ తౌసిఫ్ బాషా వాదనలు వినిపించారు.
ఎర్రమంజిల్ భవనంపై కొనసాగిన వాదనలు
ఎర్రమంజిల్ భవనం కూల్చివేతకు సంబంధించి దాఖలైన 8 ప్రజావాజ్య పిటిషన్లు, ఒక రిట్ పిటీషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం నాడు కూడా విచారణ కొనసాగించింది. పిటిషనర్ కే జితేంద్రబాబు తరఫున న్యాయవాది నళిని కుమార్ కోర్టుకు హాజరై పిటిషనర్ వాదనలు వినిపించారు. తదుపరి విచారణ బుధవారం కొనసాగనుంది.