క్రైమ్/లీగల్

డీఎన్‌ఏ పరీక్షలకు రక్త నమూనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 31: అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న కేరళ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ తనయుడు బినయ్ ముంబయి కోర్టు ఆదేశాల మేరకు తన రక్త నమూనాలను డీఎన్‌ఏ పరీక్షల నిమిత్తం సమర్పించారు. పోలీసుల కథనం మేరకు ఈ కేసులో బాధితురాలు బినయ్ కారణంగా ఓ చిన్నారికి జన్మనివ్వగా ఆ చిన్నారికి పితృత్వత్వ నిర్థారణ పరీక్షలు నిర్వహించేందుకు బినయ్ రక్త నమూనాలు సేకరించడం జరిగింది. ఈ మేరకు మంగళవారం ఇక్కడి ఓషివారా పోలీస్‌స్టేషన్‌కు స్వచ్ఛందంగా హాజరైన బినయ్ తన రక్త నమూనాలను అందజేశారు. ముంబయి హైకోర్టు ఇటీవల ఈ కేసుకు సంబంధించి బినయ్‌ను డీఎన్‌ఏ పరీక్షలకు హారవ్వాల్సిన ఆదేశించడం జరిగింది. ఈక్రమంలో డీఎన్‌ఏ పరీక్షల అనంతరం నివేదికను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఆగస్టు 26న ఈ కేసు తదుపరి విచారణ జరుగనుంది. ఇలావుండగా బీహార్‌కు చెందిన 33 ఏళ్ల మహిళా బార్ డాన్సర్ ఆరోపణ మేరకు బినయ్‌పై అత్యాచార నేరం కింద కేసు నమోదైంది. తనపై బినయ్ వినోదినీ బాలకృష్ణన్ లైంగిక దాడికి పాల్పడ్డాడని, తనను పెళ్లి చేసుకుంటానని మోసగించాడని, ప్రస్తుతం తనకు బినయ్ వల్ల కలిగిన 8 సంవత్సరాల వయసు గల కొడుకు ఉన్నాడని ఆ మహిళ ఆరోపించడం జరిగింది. ఈక్రమంలో పోలీసులు బినయ్‌పై 420, 376 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 2009 నుంచి తనకు బినయ్‌తో శారీరక సంబంధాలున్నాయని మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.