క్రైమ్/లీగల్

ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని మోసగించిన కాంగ్రెస్ నేతపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిందోరి (మధ్యప్రదేశ్), జూలై 31: ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి మోసగించిన కాంగ్రెస్ నాయకునిపై పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని షాపురా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టిక్కెట్ ఇప్పిస్తానంటూ కాంగ్రెస్ నాయకుడు ఇర్ఫాన్ మాలిక్ తన నుంచి దశల వారీగా రూ. 3.83 లక్షలు వసూలు చేసినట్లు అజి త్ దుర్వే కోత్వాల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. ఈ మేరకు మాలిక్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసు స్టేషన్ ఇన్‌ఛార్జీ అధికారి వర్షపాటిల్ తెలిపారు. డబ్బులు అడిగేందుకు వెళ్ళిన దుర్వేను కులం పేరిట దూషించినందున ఎస్‌సి, ఎస్‌టీ అత్యాచార నిరోధక చట్టం కింద మరో కేసు నమో దు చేసినట్లు ఆయన చెప్పారు. డబ్బులు తిరిగి ఇవ్వమని ఎన్నో పర్యాయాలు కోరగా కేవలం రూ.18 వేలు మాత్రమే చెల్లించినట్లు ఫిర్యాదుదారుడు అజిత్ దుర్వే తెలిపారు.
కాగా తనకు టిక్కె ట్ ఇప్పించే శక్తి లేదని, తాను టిక్కెట్ ఇప్పిస్తానని ఎవరికీ హామీ ఇవ్వలేదని, ఇదంతా కుట్ర అని కాంగ్రెస్ నాయకుడు ఇర్ఫాన్ మాలిక్ అన్నారు.