క్రైమ్/లీగల్

బడికొస్తా సైకిళ్లలో భారీ కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 2: గత ఐదేళ్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అమలైన వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల్లో కోట్లాది రూపాయల మేర అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నట్టుగా ఒకదాని వెంట మరొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. అలాగే ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో విచారణకు జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూనే ముందుగా పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను తక్షణం నిలిపివేస్తోంది. అవినీతి అక్రమాలు జరిగినట్టు విచారణలో నిర్ధారణ అయితే రెవెన్యూ రికవరీ యాక్టు కింద రికవరీతోపాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా గత ప్రభుత్వం ‘బడికొస్తా’ పేరిట కోట్ల రూపాయల మేర ఖర్చు చేసిన పథకంలోనూ భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినట్టుగా ఆంధ్రభూమి ప్రతినిధి దృష్టికి వచ్చింది. 151 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 3లక్షల 80వేల 275 సైకిళ్లను కొనుగోలు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది. తొలి నిబంధనలననుసరించి చెన్నైకు చెందిన ఐటీ సైకిల్స్ సంస్థ మాత్రమే అర్హత పొందింది. అయితే రాజకీయ జోక్యం, ఉన్నతాధికారుల ప్రభావంతో పంజాబ్‌లోని లూథియానాకు చెందిన రెండు కంపెనీలు అకస్మాత్తుగా రంగంలోకి ప్రవేశించాయి. ఉన్నతాధికారుల జోక్యంతో మార్కెట్ ధరకన్నా ఒక్కో సైకిల్‌పైనా రూ.500లు పెంచి ధర నిర్ణయించారు. అయితే చెన్నై సంస్థ టెండర్ల సమయంలో అంతకంటే తక్కువ ధరకు కోట్ చేసినప్పటికీ అత్యధిక సైకిళ్ల కోసం లూథియానా కంపెనీలకే ఆర్డర్‌లు దక్కాయి. చెన్నై కంపెనీకి కేవలం 15వేల సైకిళ్లకు, లూథియానాకు చెందిన ఒక కంపెనీకి లక్ష 78వేల 275, మరొక కంపెనీకి లక్షా 87వేల సైకిళ్లకు ఆర్డర్లు వెళ్ళాయి. అయితే లూథియానా కంపెనీలు నిర్ణీత కాలంలో సైకిళ్లను సరఫరా చేయలేకపోయినా ఒకటికి రెండు సార్లు పొడిగింపు ఇచ్చారు. ఎన్నికల తరువాత కూడా సైకిళ్ల సరఫరా చేయడానికి ఆ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇదిలావుంటే ఆ రెండు కంపెనీలు పంపించిన సైకిళ్లు కూడా నాసిరకంగా ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల హడావుడిగా చెన్నై సంస్థ పంపిన సైకిళ్లను పలుచోట్ల సీఎం జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్లను అతికించి పంపిణీ చేశారు. ఇలావుంటే ప్రభుత్వం ప్రస్తుతానికి కేవలం 30 కోట్లు మాత్రమే చెల్లించి మిగిలిన 120 కోట్ల రూపాయల చెల్లింపులను నిలిపివేసి విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. కంపెనీల సైకిళ్లకు అంటించిన స్టిక్కర్లను తొలగించి వెనక్కి పంపించాలన్న ఆలోచనతో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదిలావుంటే లూథియానా కంపెనీల గట్టు బహిరంగపర్చకుండా సర్వశిక్ష అభియాన్ అధికారులు మరో 20వేల 344 సైకిళ్ల సరఫరాకు ఇండెంట్లు సంపాదించుకున్నాయి. వీటి విషయంపై కూడా ప్రభుత్వం విచారణ జరిపించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.