క్రైమ్/లీగల్

పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 2: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎయిడ్స్ ఖైదీలకు సంబంధించి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు శుక్రవారం అధికారులను ఆదేశించింది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోని 27 మంది ఖైదీలకు ఎయిడ్స్ సోకిందనే సమాచారంపై సీరియస్‌గా స్పందించిన హైకోర్టు ఇందుకు సంబంధించి శుక్రవారం విచారణ నిర్వహించింది. జైలుకు రాకముందే ఎయిడ్స్ ఉందా.. లేక వచ్చాక వ్యాధి సోకిందా అనే దానిపై అధికారులు నిర్ధారించాలని ఆదేశించింది. ఏడు కొండలు అనే ఖైదీ తాను హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తుడనని, తనకు బెయిల్ ఇస్తే ఇంటి వద్ద కొన్నిరోజులు వైద్యం చేయించుకుంటానని న్యాయస్ధానానికి విన్నవించుకోవడంతో కోర్టు ఈమేరకు జిల్లా అధికారులను ఆదేశించింది. దీంతో శుక్రవారం నాటి విచారణ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలు జైలర్ రాజారావు కోర్టుకు హాజరయ్యారు. ఖైదీలకు అందిస్తున్న చికిత్సపై రాజారావు కోర్టుకు నివేదిక సమర్పించారు. దీంతో పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని జీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 6వ తేదీకి వాయిదా వేసింది. కాగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో
జీవిత ఖైదీలు, రిమాండు ఖైదీలు కలిపి మొత్తం 1400 మంది ఉన్నారు. 1200 మందికి పరిమితి ఉన్న జైలులో అదనంగా 200 మంది ఖైదీలు ఉండటం గమనార్హం. దీంతో జైలులో ఆస్పత్రి సౌకర్యాలు అంతంత మాత్రమేనని, జైలులో ముగ్గురు డాక్టర్లు ఉన్నా రాత్రి వేళల్లో ఏ ఒక్క డాక్టర్ అందుబాటులో ఉండటం లేదని ఖైదీలు చెబుతున్నారు.