క్రైమ్/లీగల్

-- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం --

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ / శంషాబాద్, ఆగస్టు 2: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. తమ బిడ్డలను కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా, తల్లిదండ్రులు కిడ్నాపర్‌ను వెంబడించి పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ముంబై నుంచి శ్రీనాథ్ కుంటుంబ సభ్యులు ఉదయం శంషాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్‌కు విమానంలో వచ్చిన కుటుంబం, నగరంలోకి వెళ్లేందుకు రెండు వేర్వేరు క్యాబ్‌లను బుక్ చేసుకున్నారు. పెద్దలు ఓ క్యాబ్‌లో, పిల్లలు మరో క్యాబ్‌లో ఎక్కారు. ఈ క్రమంలో పిల్లలు ఎక్కిన క్యాబ్‌తో డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. క్యాబ్ దారి మళ్లిందని గుర్తించిన తల్లిదండ్రులు, కారును వెంటాడి పట్టుకున్నారు. ఈలోగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం ఛేజింగ్ అనంతరం ఆ కారును నిలువరించి డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించారు. శ్రీనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.