క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో లెక్చరర్ దంపతుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 2: లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో లెక్చరర్ దంపతులు మృతి చెందిన సంఘటన కరీం నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి శివారులో శుక్రవారం ఉదయం వరంగల్ - కరీంనగర్ స్టేట్ హైవేపై కారు లారీని ఢీకొన్న ప్రమాదంలో లెక్చరర్ దంపతులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం హుజూరాబాద్ పట్టణంలో నివాసముంటున్న గోస్కుల నాగరాజు, శే్వత దంపతులు సింగాపురంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. ఉదయం 8.15 గంటలకు కళాశాలకు వెళ్తుండగా లారీని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వేగంగా వస్తున్న మరో లారీని ఢీకొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వరంగల్‌లోని మాక్స్ కేర్ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే శే్వత మృతి చెందింది. నాగరాజు పరిస్థితి మరింత విషమించడంతో హనుమకొండ నుండి హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కిట్స్‌లో అధ్యాపకులుగా పనిచేస్తున్న దంపతులు మృతి చెందడంతో విషాదం నెలకొంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంట తడిపెట్టించింది. శే్వత ఇటీవల గురుకుల డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా ఎంపికైంది. ఆమె మరికొద్ది రోజుల్లో పోస్టింగ్ అందుకోనుండగా ఈ ఘటన జరగడం పలువురి హృదయాల్ని కదిలించింది. శే్వత నాగరాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్ అన్నారు. వారి మృతికి సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. కిట్స్ కళాశాల ప్రిన్సిపల్ డా. కందుకూరి శంకర్, అధ్యాపకులు, సిబ్బంది లెక్చరర్ల మృతికి సంతాపం తెలిపారు.