క్రైమ్/లీగల్

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఆగస్టు 2:ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. గత నెల 23న కరీంనగర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు సీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్బరుద్దీన్‌పై ఎలాంటి కేసు నమోదు చేయకుండానే ఆయన వ్యాఖ్యల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు లేవంటూ న్యాయ నిపుణుల సలహా తీసుకొని కరీంనగర్ సీపీ వి.బి.కమలాసన్ రెడ్డి క్లీన్‌చిట్ ఇచ్చారు. దీంతో కరీంనగర్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు.
హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు చేయాలని కరీంనగర్ కోర్టును ఆశ్రయించగా మెజిస్ట్రేట్ సాయిసుధ కేసు నమోదు చేసి అక్బరుద్దీన్ ఓవైసీపై ఐపీసీ సెక్షన్ 153-ఎ, 153-బి, 506, సీఆర్‌పీసీ 156(3) కింద కేసులు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం కరీంనగర్ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో అక్బరుద్దీన్ ఓవైసీపై కేసునమోదైంది. బీజేపీ నేతలు మొదట్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసి విచారణ కొనసాగించకుండా ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా లేవంటూ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని సీపీ వి.బి.కమలాసన్ రెడ్డి క్లీన్‌చిట్ ఇవ్వడం తమను కలచివేసిందంటూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదు చేసినట్టు మూడవ పట్టణ పోలీసులు వెల్లడించారు.