క్రైమ్/లీగల్

తలాక్ చట్టం రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: తలాక్‌ను శిక్షార్హ నేరంగా పరిగణిస్తూ తాజాగా అమల్లోకి వచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. కేరళలోని సున్నీ ముస్లిం మేధావులు, మత నాయకులతో కూడిన సంస్థా కేరళ జమాయిత్-ఉల్-ఉలేమా ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేకమైనదిగా ప్రకటించాలని తన పిటిషన్‌లో సుప్రీం కోర్టును కోరింది. మతపరమైన గుర్తింపు ప్రాతిపదికగా ఒక వర్గం వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుని ఈ చట్టాన్ని తీసుకుని వచ్చిందని ఆరోపించింది. దీనిని ఆపకపోతే సమాజంలో చీలికలు, వైషమ్యాలు పెరిగిపోతాయని స్పష్టం చేసింది. అత్యధిక సంఖ్యలో అనుచరులు ఉన్న తమ సంస్థ కేరళలో అతి పెద్దదని తమ పిటిషన్‌లో పేర్కొంది. కేవలం ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని ఈ చట్టాన్ని తీసుకుని వచ్చారని, దీని అసలు ఉద్దేశ్యం ముమ్మారు తలాక్ రద్దు చేయడం కాదని, ముస్లిం భర్తలను శిక్షించడమేనని ఈ సంస్థ పేర్కొంది. ఓ ముస్లిం భర్త మూడు సార్లు తలాక్ అంటే అతడికి సెక్షన్ 4 కింద గరిష్ట స్థాయిలో మూడేళ్ళ పాటు శిక్ష విధించడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుందని తెలిపింది. అంతేకాదు ఈ చట్టంలోని 7వ సెక్షన్ కింద ఇది శిక్షార్హ నేరమే కాకుండా బెయిల్ కూడా దక్కని నేరంగా పరిగణించబడుతుందని తెలిపింది. తలాక్ రద్దు చట్టం రాజ్యాంగంలోని 14, 15, 21వ అధికరణలకు విరుద్ధంగా ఉందని, దీనిని కొట్టి వేయాలని ఈ సంస్థ కోరింది. వివాహ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న ముస్లిం మహిళను రక్షించాలంటే ఆమె భర్తను జైలు పాలు చేయడమే సరైన మార్గమని సహేతుకంగా ఆలోచించే ఎవరూ భావించరని ఈ సంస్థ పేర్కొంది.