క్రైమ్/లీగల్

నలుగురు జైషే ఉగ్రవాదుల హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్ : జమ్మూ-కాశ్మీర్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు చొరబడుతుండడాన్ని నిరోధించడం భారత సైనిక దళాలకు సవాల్‌గా పరిణమించింది. ఉగ్రవాదులను ఎక్కడికక్కడ ఏరి వేస్తున్నా, పుట్టుకుని వస్తూనే ఉండడంతో స్థానికంగా ఉద్రిక్తత, ప్రజల్లో భయాందోళనలు కనిపిస్తున్నాయి. ఇలాఉండగా శనివారం బారాముల్లా, షొపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు కలిసి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. దీంతో దక్షిణ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సొపోర్ టౌన్‌షిప్‌లో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాల చేతుల్లో ఉగ్రవాదులు ఇద్దరూ మరణించారు. శుక్రవారం రాత్రి షొపియాన్‌లోని పాండుషాన్‌లో భద్రతా బలగాలపై కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు.. వీరు జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాదులుగా గుర్తించామని ఆర్మీ అధికారులు చెప్పారు.