క్రైమ్/లీగల్

మే 3లోగా కావేరీ ముసాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కావేరీ యాజమాన్య బోర్డు పూర్తి ముసాయిదాను మే 3లోగా నివేదించాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. కావేరీ జలాల పంపకాల్లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ తమిళనాట కొద్ది రోజులుగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే నేరుగా ఈ అంశాన్ని ప్రస్తావించకుండా, తమిళనాడు, కర్నాటక సహా కావేరీ జలాల భాగస్వాములంతా శాంతియుతంగా ఉండాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కావేరీ పిటిషన్లను విచారిస్తూ తమిళనాడు, కర్నాటక, కేరళ, పాండిచ్చేరిలు నదీ జలాలు ఎంతెంత వాడుకోవాలో ఇప్పటికే కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ (సీడబ్ల్యుడీటీ) తన తీర్పులో నిర్ణయించిందని గుర్తు చేసింది. ట్రిబ్యునల్ నిర్ణయానికి భాగస్వాములంతా కట్టుబడి ఉండాలని ఆదేశించింది. ముసాయిదాకు తుది రూపునిచ్చి వాటాలు తేల్చేంత వరకూ రాష్ట్రాలు శాంతియుతంగా ఉండాలని కోరింది. దశాబ్దాల కాలంనాటి కావేరీ వివాదాలను దృష్టిలో పెట్టుకుని గతంలో ఇచ్చిన 465 పేజీల తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, దానే్న 2007 సీడబ్ల్యుడీటీ అవార్డుగా నిర్ణయించారని, ఇక దాన్ని ఎంతమాత్రం పొడిగించడానికి వీల్లేదని ధర్మాసనం పేర్కొంది. సుప్రీం కోర్టు గత ఫిబ్రవరి 16న కర్నాటకకు 270 టీఎంసీ జలాలు కేటాయిస్తూ, తమిళనాడుకు 14.75 టీఎంసీ జలాలు కుదించిన విషయం తెలిసిందే. కర్నాటక తాగునీటి అవసరాల నేపథ్యంలో ఈ తీర్పునిస్తూ, తమిళనాడుకు పరిహారంగా రివర్ బేసిన్‌లోని 10టీఎంసీ భూగర్భ జలాలు వాడుకోవడానికి అనుమతించడం తెలిసిందే. సుప్రీం తీర్పు ప్రకారం 740 టీఎంసీ కావేరీ జలాల్లో తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరి 404.25 టీఎంసీ, 284.75 టీఎంసీ, 30 టీఎంసీ, 7 టీఎంసీ కేటాయింపులు జరగడం తెలిసిందే.