క్రైమ్/లీగల్

సెన్సార్ బోర్డు నిర్ణయమే ఫైనల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: సినిమాల విడుదలకు సంబంధించిన కేంద్ర సెన్సార్ బోర్డు నిర్ణయమే అంతిమమని, ఒక్కసారి బోర్డు క్లియరెన్స్ లభించిన తర్వాత ఏ చిత్ర ప్రదర్శనను అడ్డుకునే హక్కు ఎవ్వరికీ ఉండదని సుప్రీంకోర్టు నిర్ద్వంద్వంగా తెలిపింది. దీంతో నానక్ షా పకీర్ చిత్రాన్ని ఏప్రిల్ 13న దేశవ్యాప్తంగా విడుదలకు మార్గం సుగమమైంది. చిత్రం విడుదలను నిషేధించిన సిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీని (ఎస్‌జీపీసీ) ఈ సందర్భంగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖన్‌విల్కర్, జస్టిస్ డి.వై చంద్రచూడ్‌లతో
కూడిన ధర్మాసనం విమర్శించింది. ఒక్కసారి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్ట్ఫికేషన్ (సీబీఎఫ్‌సీ) సర్ట్ఫికెట్ జారీ చేసిన తర్వాత చిత్రం విడుదలను అడ్డుకోవడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. చిత్రానికి మార్చి 28న సీబీఎఫ్‌సీ సర్ట్ఫికెట్ జారీ చేసినా ఎస్‌జీపీసీ హెచ్చరికల నేపథ్యంలో చిత్రం విడుదల నిలిచిపోయింది. దీంతో ఈ చిత్ర నిర్మాత, మాజీ నేవీ అధికారి అయిన హరిందర్ ఎస్.సిక్కా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిక్కుమత వ్యవస్థాపకుడు గురునానక్ దేవ్ జీవితానికి సంబంధించిన చిత్రమిది. కాగా చట్టబద్ధమైన సంస్థసీబీఎఫ్‌సీ సర్ట్ఫికెట్ జారీ చేసిన తర్వాత కూడా దీన్ని అడ్డుకోవడమంటే ఈ దేశ చట్టాలను గౌరవించకపోవడమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.