క్రైమ్/లీగల్

ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిడదవోలు, ఏప్రిల్ 12: జిల్లాలోని కొవ్వూరు, జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ల పరిధిలో అనేక గ్రామాల రైతులకు గత మూడు సంవత్సరాలుగా కంటిమీద కునుకులేకుండా చేసిన ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలను ఎట్టకేలకు నిడదవోలు పోలీసులు అరెస్టుచేశారు. 2016 నుంచి చాగల్లు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, దేవరపల్లి, నల్లజర్ల మండలం అనంతపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం మండలాల్లోని తొమ్మిది పోలీసు స్టేషన్ల పరిధిలో 24 కేసుల్లో ముద్దాయిలైన నలుగుర్ని నిడదవోలు రూరల్ ఎస్సై పి రవికుమార్ గురువారం ఉదయం తిమ్మరాజుపాలెం గ్రామ శివార్లలో వాహనాలు తనిఖీచేసే క్రమంలో అనుమానాస్పదంగా బైకులపై సంచరిస్తున్న వీరిని అదుపులోనికి తీసుకుని విచారించగా ఈ చోరీల ఉదంతం వెలుగుచూసింది. మండలంలోని ఉనకరమిల్లి గ్రామానికి చెందిన వేముల శ్రీనివాస్, తాడిమళ్ల గ్రామానికి చెందిన గుంజే వెంకటేశ్వరరావు, కోరుమామిడి గ్రామానికి చెందిన బలే వెంకటేశులు, చాగల్లు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన పసలపూడి పున్నాలయ్యలను అదుపులోనికి విచారించారు. గత మూడు సంవత్సరాలుగా 24 చోరీల్లో 44 ట్రాన్స్‌ఫార్మర్లను తస్కరించినట్టు వీరు అంగీకరించినట్టు సీఐ ఎం బాలకృష్ణ తెలిపారు. వీరు చోరీ చేసిన రాగి వైరును, ముద్దాయిలను గురువారం మధ్యాహ్నం మీడియా ఎదుట హాజరుపరిచారు. స్వాధీనం చేసుకున్న 260 కేజీల రాగి వైరు, చోరీలకు వినియోగించిన 16 పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. రాగి వైరు విలువ రూ.1.5 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. ఈ నలుగురు ముద్దాయిలపై సస్పెక్ట్ షీటు ఓపెన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ కేసును సమిశ్రగూడెం ఎస్సై డి రవికుమార్, ఐడీ పార్టీ ఏఎస్సై ఎండీ షరీఫ్, కానిస్టేబుల్స్ వి భాలచంద్ర, అనిల్‌కుమార్, ఎస్‌వివి సత్యనారాయణ, నాగేశ్వరరావు, ఎవి నరేష్‌బాబు, శ్రీహరిలు ఛేదించారు. వీరికి రివార్డు నిమిత్తం కొవ్వూరు డీఎస్పీ ఎస్ వెంకటేశ్వరరావు జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌కు సిఫార్స్ చేసినట్టు సీఐ బాలకృష్ణ తెలిపారు.