క్రైమ్/లీగల్

గోవుల మృతిపై దర్యాప్తునకు సిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 12: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన విజయవాడ శివారు గోశాలలోని ఆవుల మృత్యువాత కేసును ఛేదించేందుకు రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్ దృష్టి సారించారు. కొత్తూరు- తాడేపల్లిలోని గోశాలలో ఈ నెల 9న పెద్దసంఖ్యలో ఆవులు మృత్యువాత పడిన సంఘటనను డీజీపీ ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) డీజీపీ నియమించారు. ఈ బృందంలో విజయవాడకు చెందిన ఏసీపీ శ్రీనివాసరావుతో పాటు ఐదుగురు అధికారులను ఈ కేసును దర్యాప్తు చేసేందుకు నియమితులయ్యారు. ఇప్పటివరకు సరైన ఆధారాలు లభించక పోవడంతో డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. గోవుల మృతికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించి, పశు సంవర్థక, ఫోరెన్సిక్ సైన్స్ శాఖల అధికారుల సమన్వయంతో ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేయనున్నారు. ప్రకాశం జిల్లా నుంచి తెచ్చిన గడ్డిని ఆవులకు అందించిన నేపథ్యంలో ఆ దిశగా సంబంధిత యాజమాన్యాన్ని విచారించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి, నివేదికను ప్రభుత్వానికి సిట్ బృందం సమర్పిస్తుంది.