క్రైమ్/లీగల్

కుందూనదిలో నలుగురి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం : కడప జిల్లా కమలాపురం సమీపంలోని కుందూనదిలో నలుగురు కొట్టుకుపోయారు. ఒకరి మృతదేహం లభించగా, ముగ్గురు పిల్లల కోసం గాలిస్తున్నారు. బక్రీద్ పండుగ మరుసటిరోజు వనభోజనానికి వెళ్లిన ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. కమలాపురం పట్టణంలోని దర్గావీధికి చెందిన జాఫర్ హుస్సేన్ ఇరుగుపొరుగు ముస్లిం కుటుంబాలు కలిసి 3 నదుల సంగమమైన మూలగడ్డ వద్దకు మంగళవారం వనభోజనానికి వెళ్లారు. ముగ్గురు చిన్నారులు ఆడుకుంటూ కుందూనది వద్దకు వెళ్లి కాలుజారి నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇది గమనించిన జాఫర్ హుస్సేన్ వారిని రక్షించేందుకు నదిలోకి దూకాడు. వరద ఉద్ధృతికి అతడు కూడా కొట్టుకుపోయాడు. ఇది గమనించిన స్థానికులు నదిలోకి దూకి వెతగ్గా జాఫర్ హుస్సేన్ (42) మృతదేహం లభించింది. ముగ్గురు చిన్నారుల కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి గాలింపుచర్యలు ముమ్మరం చేశారు.