క్రైమ్/లీగల్

పాత కక్షలతో హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, ఆగస్టు 13: పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన సతన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. తుక్కుగూడాలో నివాసం ఉండే నర్సింగ్‌దాస్ పాత నేరస్థుడు. ఒక మర్డర్ కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతనికి శత్రువులు అధికంగా ఉన్నారు. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి బోరబండలో తండ్రి చరణ్‌గౌడ్ నిర్వహించే కల్లు కాంపౌండ్ దగ్గర వచ్చినట్టు సమాచారం అందుకున్న ప్రత్యర్థులు అతనిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ నర్సింగ్ మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని బలానగర్ డీసీపీ పద్మజ, ఏసీపీ గోవర్ధన్, ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ సందర్శించి వివరాలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం ఐదుగురు అనుమానితులను అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. పాత కక్షలతోనే హత్య జరిగినట్టు డీసీపీ పద్మజా తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి హత్యతో సంబంధం ఉన్న అందరిని అరెస్టు చేస్తామని అన్నారు.