క్రైమ్/లీగల్

అయోధ్య అంటేనే.. శ్రీరాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: శ్రీ రాముడి జన్మస్థలం అయోధ్యే పూజనీయమైన స్థలం అని, దీని దృష్ట్యా 2.77 ఎకరాల వివాదస్పద స్థలంలో ముస్లింలు ఎంత మాత్రం భాగాన్ని కోరజాలరని రాంలల్లా విరాజమాన్ సంస్థ మంగళవారం సుప్రీం కోర్టులో తమ వాదన వినిపించింది.
ఈ స్థలాన్ని విభజించడం అన్నది ఆ పవిత్ర దేవతా మూర్తిని దెబ్బతీయడమేనని ఈ సంస్థ తరపు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. అయోధ్యలోని వివాదస్పద 2.77 ఎకరాలపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాఉండగా మంగళవారం రాం లల్లా విరాజమాన్ సంస్థ సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు తమ వాదన వినిపించింది. సుప్రీం ధర్మాసనం జస్టిస్ ఎస్‌ఏ బాబ్డె, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్‌ఏ నజీర్‌లతో కూడిన ధర్మాసనం ముందు రాం లల్లా విరాజమాన్ సంస్థ తరఫున సీనియర్ అడ్వకేట్ సీఎస్ వైధ్యనాథన్ వాదన వినిపించారు. భగవంతుడైన శ్రీ రాముని జన్మస్థలం అయోధ్యనేనని ప్రజల విశ్వాసం అని చెప్పారు. ఆ తర్వాత 1500 సంవత్సరంలో ఆ స్థలంలో మూడు గుమ్మాల మసీదును నిర్మించడం జరిగిందని, దీంతో హిందువుల విశ్వాసం, పవిత్రత, గౌరవాన్ని భంగపరచలేరని అన్నారు. అయోధ్యలో శ్రీ రామున్ని ఆరాధించడాన్ని హిందువులు ఎప్పుడూ నిలిపి వేయలేదన్నారు.
కాగా ఆ స్థలంలో బాబర్ మసీదు నిర్మించాడని ముస్లింలు నిరూపించలేకపోయారని అన్నారు. ఈ సందర్భంగా అడ్వకేట్ వైద్యనాథన్ లోగడ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారు. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం అయోధ్యలో ఆలయం ఉండేదని, ఆ తర్వాతే మసీదు నిర్మాణం జరిగిందని అన్నారని ఆయన గుర్తు చేశారు. అనేక రికార్డులను పరిశీలించిన పిదప హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవీ శర్మ, సుధీర్ అగర్వాల్ తీర్పునిచ్చారన్నారు. శిథిలమైన ఆలయం స్థానే మసీదు నిర్మాణం జరిగిందని జస్టిస్ ఖాన్ అన్నారని ఆయన గుర్తు చేశారు. 1856-57 నుంచి 1934 వరకు ముస్లింలు నమాజు చేశారన్నారు. కాగా 1934 నుంచి ముస్లింలు ఐదు సార్లు నమాజు చేయడం నిలిపి వేశారన్నారు. అయితే శతాబ్దాలుగా హిందువులు అయోధ్యలో నిత్యం ప్రార్థనలు జరిపినట్లు అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. శ్రీ రాముడు, సీత అక్కడే ఉన్నారని హిందువుల విశ్వాసం అని ఆయన చెప్పారు. మక్కా, జెరుసలెం ముస్లింల ప్రార్థనా స్థలాలని ఆయన వివరించారు. శ్రీ రాముని నిజమైన జన్మస్థలం ఏదని బెంచ్ అడ్వకేట్‌ను ప్రశ్నించింది.