క్రైమ్/లీగల్

బాలికలపై లైంగిక వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), ఆగస్టు 14: విద్యాబుద్ధులు నేర్పించి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థినులను లైంగికంగా వేధిస్తూ చివరకు కటకటాల పాలయ్యారు. విశాఖ జిల్లా ఆనందపురం పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన ఈ సంఘటన సభ్య సమాజం తల దించుకునేలా చేసింది. స్థానిక పెద్దిపాలెంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా సుందరరావు, ఉపాధ్యాయుడిగా వెంకటేశ్వరరావు విధులు నిర్వహిస్తున్నారు. ఒకటి నుండి ఏడో తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయినులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా కొంతకాలంగా సుందరరావు, వెంకటేశ్వరరావు తరగతి గదిలోని బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారు. బుధవారం వీరిద్దరూ శృతి మించి తరగతిలోని బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్టు గమనించిన మహిళా ఉపాధ్యాయినులు వీరిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఏసీపీ ఎస్ రంగారెడ్డి, ఉత్తర ఏసీపీ రవిశంకరరెడ్డి, ఎస్సీఎస్టీ సెల్ విభాగం ఏసీపీ త్రినాథరావు, పోలీస్ సిబ్బందితో పాఠశాలకు వచ్చి బాలికలను విచారించారు. ఈ మేరకు నిందితులిద్దరిపై ఫోక్సో, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసినట్టు ఏసీపీ రవిశంకరరెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నామని, గురువారం ఉదయం కోర్టులో హాజరు పరుస్తామన్నారు. ఆనందపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.