క్రైమ్/లీగల్

దృష్టి మళ్లించి చోరీలు.. ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, ఆగస్టు 14: సార్.. మీ.. డబ్బులు కింద పడ్డాయి చూసుకోండి.. మీ చొక్కాపై ఇంక్ పడింది.. బైక్ టైరులో గాలి లేదంటూ దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర రాంజీ దొంగల ముఠా సభ్యులను అరెస్టుచేసి వారివద్ద నుండి నగదు, గంజాయిని ఎల్‌బీనగర్, వనస్థలిపురం ఎస్‌వోటి, సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నేరేడ్‌మెట్ పరిధిలోని రాచకొండ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వివరాలను పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. తమిళనాడు తిరుచిరాపల్లి ప్రాంతానికి చెందిన పార్తివన్ దీపక్ అలియాస్ దీపు (31), తంగరాజ్ సత్యరాజ్ (31), యోగరాజ్ (23), సురేష్ (36) గతంలో స్పినింగ్ మిల్లులో పని చేసేవారు. సులభంగా డబ్బులు సంపాందించాలనే ఉద్దేశంతో ముఠాగా ఏర్పడి కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగూళురు, తమిళనాడులో దొంగతనాలకు పాల్పడుతున్నట్టు సీపీ తెలిపారు. ముఠా సభ్యులలో ఒకరు ఐదు, రెండు వందల నోట్లు కింద పడవేసి - సార్.. మీ డబ్బులు కింద పడ్డాయి అంటూ దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. మే 7వ తేదీన ఉదయం సేఫ్‌గార్డు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీవారు వనస్థలిపురం పనామా చౌరస్తాలో ఉన్న ఏటీఎం సెంటర్‌లో డబ్బులు జమ చేసేందుకు వచ్చారు. అదే సమయంలో ముఠా సభ్యులు డబ్బులు కింద పడ్డాయని చెప్పి సిబ్బంది దృష్టి మళ్లించి రూ.58.97 లక్షల రూపాయల నగదును చోరీ చేసినట్టు సీపీ తెలిపారు. వెంటనే సంస్థ సిబ్బంది జరిగిన విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం ఉదయం వనస్థలిపురంలో కారులో అనుమానస్పదంగా తిరుగుతున్న నలుగురు ముఠా సభ్యులను పట్టుకుని విచారించగా అసలు విషయం చెప్పారు. వెంటనే వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.4 లక్షల నగదు, 15 కేజీల గంజాయి, ఆరు సెల్‌ఫోన్‌లు, కారు స్వాధీనం చేసుకున్నట్టు సీపీ తెలిపారు. సమావేశంలో పోలీస్ ఉన్నతాధికారులు జీ.సుధీర్ బాబు, సుప్రీత్ సింగ్, జే.సురేందర్ రెడ్డి, డీ.శ్రీనివాస్, రవికుమార్, ప్రవీణ్ బాబు పాల్గొన్నారు.

చిత్రం...పోలీసుల అదుపులో నలుగురు ముఠా సభ్యులు