క్రైమ్/లీగల్

మున్సిపల్ ఎన్నికలపై విచారణ 16కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై బుధవారం నాడూ హైకోర్టులో విచారణ కొనసాగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ కొనసాగించింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, పిటిషనర్లు లేవనెత్తిన అంశాలను సైతం సరిచేయడం జరిగిందని ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
సర్పంచ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసిన హైకోర్టు
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి సర్పంచ్ బొస్కా ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఎత్తివేస్తూ బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసిందని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ తెలిపారు.