క్రైమ్/లీగల్

కటకటాల వెనక్కి చైన్‌మెన్ల గ్యాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, ఏప్రిల్ 12: కార్పొరేటర్ పేరు చెప్పి గృహ నిర్మాణాలు చేపడుతున్న వారి దగ్గరకు వెళ్లి డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు కార్పొరేషన్ సిబ్బంది, ఓ పత్రికకు చెందిన వ్యక్తి, మరో యువతిని అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ నవాబ్‌జాని నిందితులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పాలక సంస్థలో చైన్‌మెన్‌గా గుణదలలో విధులు నిర్వహిస్తున్న నక్కా జ్యోతీశ్వర్, అజిత్‌సింగ్‌నగర్‌లో విధులు నిర్వహిస్తున్న గజ్జల ఓబులేసు స్థానికులు తలతోటి సంపత్, దండూరి సత్యవేణి, విలేఖరి అంకోలు పుల్లారావు స్నేహితులు. కొన్ని ఆరోపణల నేపథ్యంలో జ్యోతీశ్వర్‌ను ఇటీవల అధికారులు సస్పెండ్ చేశారు. గతంలో సింగ్‌నగర్‌లో పని చేసిన అనుభవం ఉన్న జ్యోతీశ్వర్ ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఓబులేసు, విలేఖరి పుల్లారావు, సంపత్, సత్యవేణితో కలిసి అనుమతులు లేని గృహ నిర్మాణాల్ని టార్గెట్ చేశారు. ఎక్కడైనా గృహ నిర్మాణాలు జరిగితే వారి దగ్గరకు వెళ్లి బెదిరింపులకు పాల్పడటం, నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు ఉన్నాయంటూ యజమానులను భయపెట్టి వారి నుండి డబ్బులు దండుకుంటుంటారు. పైగా దీనిలో నగర పాలక సంస్థ అధికారులకు, కొందరు విలేఖరుల పేర్లు చెప్పి దందా జరుపుతుంటారు. ఇదే విధంగా 52వ డివిజన్ నందమూరి నగర్‌కు చెందిన చావలి చంద్రశేఖరశర్మ ఇదే ప్రాంతంలో గుడి మండపం నిర్మించడంతో పాటు ఇళ్లు కట్టుకుంటున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఈ ముఠా వారి వద్దకు వెళ్లి అనుమతులు లేకుండా ఏలా నిర్మిస్తారంటూ డబాయించారు. దీంతో శర్మ భయాందోళనకు గురైయ్యాడు. కార్పొరేటర్ శ్రావణితో మాట్లాడండి అంటూ తమ ప్రణాళికలో భాగంగా దండూరి సత్యవేణి చేత కార్పొరేటర్‌లా మాట్లాడించారు. ట్రూ కాలర్‌లో సైతం కార్పొరేటర్ ఫొటో, పేరు ఫోన్‌లో చూపించేలా భ్రమింపజేశారు. దీంతో నిజంగానే కార్పొరేటర్ తమ ఇల్లు కూలగొడతారేమోనన్న భయంతో తాను రూ.2లక్షలు మాత్రమే ఇచ్చుకోగలనని, తమ ఇంటిని కాపాడాల్సిందిగా శర్మ ఈ బృందాన్ని అభ్యర్థించాడు. అయితే, మూడు విడతలుగా డబ్బులిస్తానని చెప్పిన శర్మ ఆ ప్రకారమే మూడు విడతల్లో రూ. 1లక్షా 20 ఇచ్చారు. తర్వాత ప్రెస్‌కు, అధికారులకు ఇవ్వాలంటూ మరో రూ.30వేలును శర్మ నుండి ఈ బృందం తీసుకున్నారు. వీరి ప్రవర్తనపై అనుమానం కలిగిన శర్మ డైరెక్టుగా కార్పొరేటర్‌ను కలిసి జరిగిన విషయాన్ని చెప్పగా కార్పొరేటర్ అవాక్కయ్యారు. వెంటనే స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి సదరు బృంద సభ్యుల్ని పక్కా ఆధారాలతో పట్టుకున్నారు. ఈ నెల 7న కార్పొరేటర్ శ్రావణి జరిగిన ఘటనకు సంబంధించి అజిత్‌సింగ్‌నగర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సీఐ జగన్మోహనరావు ఆదేశాలతో ఎస్సై బీవీ శివప్రసాద్ కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా మొదటి జ్యోతీశ్వర్‌ను అదుపులోకి తీసుకుని స్టేట్‌మెంట్ రికార్డు చేశారు అనంతరం చైన్‌మెన్ ఓబులేసు, విలేఖరి పుల్లారావు ఇతర సభ్యుల్ని కూడా అరెస్టు చేసినట్లు అడిషనల్ డీసీపీ నవాబ్‌జాని తెలిపారు. ఈ సమావేశంలో నార్త్ జోన్ ఏసీపీ శ్రావణి, సీఐ జగన్మోహనరావు పాల్గొన్నారు.