క్రైమ్/లీగల్

‘త్రిపుల్ తలాక్’ నిరాకరించిందని..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రవస్తి, ఆగస్టు 19: త్రిపుల్ తలాక్‌ను తిరస్కరించిందని ఓ వివాహిత మహిళపై ఆమె భార్య, మామ కిరోసిన్ పోసి నిప్పంటించిన వైనం భారత్-నేపాల్ సరిహద్దులోని గాద్రా గ్రామంలో చోటు చేసుకొంది. అయితే, వరకట్న వేధింపులతోనే మహిళను దారుణంగా కొట్టి.. కిరోసిన్ పోసి హతమార్చారని పోలీసులు కేసు నమోదు చేశారు. భిన్న వాదనలు వినిపిస్తున్న ఈ కేసుకు సంబంధించి ఎస్పీ అశిష్ శ్రీవాత్సవ కథనం మేరకు.. ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. త్రిపుల్ తలాక్‌కు సంబంధించి తమవద్ద ఎటువంటి ఆధారం కానీ ఫిర్యాదు కానీ లేదని ఎస్పీ చెప్పారు. సరుూదా, నఫీజ్‌లకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. నఫీజ్ ముంబయిలో పనిచేస్తుండగా.. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నఫీజ్ ఈనెల ఆరో తేదీన ఫోన్‌లో విడాకులు చెప్పాడని సరుూదా తండ్రి రంజాన్ విలేఖరులకు తెలిపాడు. త్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ పార్లమెంట్ బిల్లును గత నెలలో ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఘర్షణ నేపథ్యంలో నఫీజ్, అతని తండ్రి సరుూద్‌ను శుక్రవారం గ్రామానికి తీసుకొచ్చారు. అదే రోజు రాత్రి సరుూద్‌పై కిరోసిన్ పోసి నిప్పంటించడంతో తమ కుమార్తె మరణించిందని రంజాన్ తెలిపారు. ఆరేళ్ల తమ మనుమడి కళ్లెదుటే ఈ దారుణం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నఫీజ్ కుటుంబంతో ఎలాంటి రాజీకి రాలేదనీ.. త్రిపుల్ తలాక్‌కు సరుూద్ అంగీకరించక పోవడంతోనే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సరుూద్‌ను ఏ రకంగా హతమార్చారన్న అంశంపై విచారణ జరుపుతున్నామని.. విషయం తేలిన వెంటనే దోషులపై కఠిన చర్యలు తీసుకొంటామని పోలీసులు స్పష్టం చేశారు.