క్రైమ్/లీగల్

సెప్టెంబర్ లోపు టీచర్ల నియామకాలు భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాలపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ 2013 నుంచి విచారణలో ఉన్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం ముగించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాల్లో వౌలిక సాదుపాయాల కల్పన, ఉపాధ్యాయ నియామకాలపై 2013లో న్యాయవాది జేకే రాజు పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల వౌలిక సాదుపాయాలు, ఉపాధ్యాయ నియామకాలపై సుదీర్ఘ విచారణ జరిపించారు. సోమవారం ఈ పిటిషన్ జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, పాఠశాలల్లో వౌలిక వసతుల కల్పనపై రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎస్కే జోషి ప్రస్తుత పరిస్థితులపై అఫిడవిట్లు దాఖలు చేశారు. సెప్టెంబరు 4లోపు ఉపాధ్యాయుల నియామకాన్ని పూర్తి చేస్తామని, పాఠశాలల్లో వసతులపై న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధర్మాసనానికి వివరించింది. ఏపీ ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన అఫిడవిట్‌పై సర్వోన్నత న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. 6 నెలల్లోపు నియామకాలు, వౌలిక వసతుల కల్పనపై తమ ఆదేశాలు పాటించాలని ఏపీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం
విచారణ ముగిస్తున్నట్టు వెల్లడించింది. మరో వైపు తెలంగాణలో 2వేల ఉపాధ్యాయులను నియమించామని, మరో 4400 పోస్టుల భర్తీపై హైకోర్టులో పిటిషన్ ఉండటంతో ఆలస్యమైందని ప్రధాన కార్యదర్శి అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను వచ్చేవారం విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాది జీఎన్ రెడ్డి, తెలంగాణ పేరెంట్స్ అసోషియేషన్ తరపున శ్రావణ్‌కుమార్ విచారణకు హాజరయ్యారు.